పుట్టుడు దుఃఖంతో రంది పెట్టుకుంటే.. చివరికి పండులాంటి బిడ్డ పుట్టాడు

పుట్టుడు దుఃఖంతో రంది పెట్టుకుంటే.. చివరికి పండులాంటి బిడ్డ పుట్టాడు

Phani CH

|

Updated on: Dec 14, 2024 | 10:50 AM

ప్రముఖ కమెడియన్, జబర్దస్త్ ఫేమ్ యాదమ్మ రాజు తండ్రయ్యాడు. అతని భార్య స్టెల్లా రాజ్ పండంటి మగ బిడ్డను ప్రసవించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు యాదమ్మ రాజు దంపతులు. ఈ మేరకు తమ యూట్యూబ్‌ ఛానెల్ లో ఒక వీడియోను పంచుకున్నారు.

దీంతో పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, సినీ అభిమానులు, నెటిజన్లు యాదమ్మ రాజు దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ గుడ్ న్యూస్‌ను పక్కకు పెడితే.. చాలా మందిలాగే యాదమ్మ రాజు భార్య స్టెల్లాకు కూడా ప్రసవ సమయంలో పలు సమస్యలు తలెత్తాయట. అందుకే ఈ ప్రసవం అంత ఈజీగా జరగలేదంటూ వారు తమ అనుభవాలను యూట్యూబ్ వీడియోలో పంచుకున్నారు. నార్మల్ చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళ్తే ఉమ్మునీరు తగ్గిందన్నారని.. త్వరగా ప్రసవం చేయాలంటూ డాక్టర్లు చెప్పారని స్టెల్లా తన వీడియోలో పంచుకున్నారు. దీంతో డాక్టర్ల సలహాతో ఒక ఇంజెక్షన్‌ తీసుకుని ఇంటికి వచ్చాను. ఆ తర్వాత ఇంకో డాక్టర్‌ను సంప్రదిస్తే ఇది చాలా ఎమర్జెన్సీ కేసు.. వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్‌ అవ్వాలన్నారు. అప్పటికీ కడుపులో ఉన్న బిడ్డకు గ్యారెంటీ ఇవ్వలేమంటూ డాక్టర్లు చెప్పారని ఆమె ఎమోషనల్ అయ్యారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చేతబడులు.. భయంకర సంఘటనలు.. ఆహాలో హడలెత్తించే హారర్ థ్రిల్లర్ సినిమా

430 కోట్ల ఆస్తులు.. 50 కోట్ల విలువైన లగ్జరీ కార్లు !! అది డా… సూపర్ స్టార్ అంటే !!