అరటి పండు గొడవ.. రైళ్లనే ఆపేసిన కోతులు !!

అరటి పండు గొడవ.. రైళ్లనే ఆపేసిన కోతులు !!

Phani CH

|

Updated on: Dec 14, 2024 | 11:21 AM

‘తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది’ అన్న సామెత ఊరికే రాలేదు. ఎవరైనా వింత పనులు చేస్తుంటే కోతి చేష్టలని అంటుంటాం. ఈ సామెతను నిజం చేస్తూ రెండు కోతుల మధ్య అరటి పండు కోసం జరిగిన గొడవతో ఏకంగా అరగంట పాటు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విస్తుగొలిపే ఈ ఘటన బిహార్‌లోని ఓ రైల్వే స్టేషన్ వద్ద జరిగింది.

సమస్తిపూర్‌ రైల్వే స్టేషన్‌లోని ఓ ఫ్లాట్‌ఫామ్‌ వద్ద రెండు కోతులు ఓ అరటి పండు కోసం ఘర్షణపడ్డాయి. ఈ క్రమంలో ఒక కోతి రబ్బరు లాంటి ఒక వస్తువును ఇంకో వానరం మీదికి విసిరింది. అది కాస్త వెళ్లి రైల్వే ఓవర్‌ హెడ్‌ వైర్‌కి తగిలింది. వెంటనే షాట్‌ సర్క్యూట్‌ జరిగి అదే లైన్‌లోని ఒక వైర్ తెగిపోయింది. దీంతో అక్కడ నిలిచి ఉన్న రైలు బోగీపై పడింది. ఈ క్రమంలో అక్కడ నుంచి బయలుదేరాల్సిన ఆ రైలు ఆగిపోయింది. తక్షణమే స్పందించిన రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్.. కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేసింది. విద్యుత్ సరఫరాను నిలిపివేసి మరింత నష్టం జరగకుండా నివారించింది. చివరకు ఎలక్ట్రికల్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని.. మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్దరించడంతో తిరిగి ఆ రైలు బయలుదేరింది. వానరాల ఘర్షణ వల్ల జరిగిన ప్రమాదం వల్ల నాలుగో నెంబరు ఫ్లాట్‌ఫామ్‌పై నుంచి వెళ్లాల్సిన బిహార్‌ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు 15 నిమిషాలు ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అరగంట పాటు రాకపోకలు నిలిచిపోయాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంగరంగ వైభవంగా ఆవుదూడకు గ్రాండ్‌గా ఉయ్యాల ఫంక్షన్‌ !!

పుట్టుడు దుఃఖంతో రంది పెట్టుకుంటే.. చివరికి పండులాంటి బిడ్డ పుట్టాడు

చేతబడులు.. భయంకర సంఘటనలు.. ఆహాలో హడలెత్తించే హారర్ థ్రిల్లర్ సినిమా

430 కోట్ల ఆస్తులు.. 50 కోట్ల విలువైన లగ్జరీ కార్లు !! అది డా… సూపర్ స్టార్ అంటే !!