Video: లేటు వయసులో కళ్లు చెదిరే షాట్‌.. ఫిదా చేస్తోన్న లోక్‌సభ స్పీకర్ వీడియో.. ఫిదా అవ్వాల్సిందే

Rajya Sabha vs Lok Sabha Cricket Match: మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో నేడు జరుగుతున్న పార్లమెంటేరియన్స్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అతిథిగానే కాదు, ఓ చూడముచ్చటైన షాట్‌తో ఆకట్టుకున్నాడు. రాజ్యసభ ఛైర్మన్ XI vs లోక్‌సభ స్పీకర్ XI స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో లోక్‌సభ స్పీకర్ కొద్దిసేపే బ్యాటింగ్ చేసి అలరించారు.

Video: లేటు వయసులో కళ్లు చెదిరే షాట్‌.. ఫిదా చేస్తోన్న లోక్‌సభ స్పీకర్ వీడియో.. ఫిదా అవ్వాల్సిందే
Lok Sabha Speaker Om Birla
Follow us
Venkata Chari

|

Updated on: Dec 15, 2024 | 12:23 PM

Rajya Sabha vs Lok Sabha Cricket Match: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆదివారం పార్లమెంటేరియన్ల మధ్య జరిగిన స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో తనలో దాగి ఉన్న హిడెన్ టాలెంట్‌ చూపించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైలరవుతోంది. చూడముచ్చటైన షాట్‌తో ఆకట్టుకున్నాడు. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని లోక్‌సభ స్పీకర్ XI, కిరెన్ రిజిజు సారథ్యంలోని రాజ్యసభ ఛైర్మన్ XIతో తలపడింది. టీబీ రహిత భారత్ ప్రచారంలో భాగంగా నిర్వహించిన 20 ఓవర్ల మ్యాచ్ రాజకీయ శ్రేణుల నుంచి పార్లమెంటు సభ్యులను ఒకచోట చేర్చింది. ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ బిర్లా.. కేవలం అతిథిగానే కాకుండా మైదానంలో బ్యాటింగ్‌కు దిగి ఆకట్టుకున్నారు.

డిసెంబర్ 15న ఉదయం 9.00 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమైనప్పటి నుంచి తరచూ అంతరాయాలను ఎదుర్కొంటోంది.

ఇవి కూడా చదవండి

లోక్‌సభ స్పీకర్ XI టీం..

అనురాగ్ సింగ్ ఠాకూర్ (కెప్టెన్), గుర్మీత్ సింగ్ హైర్, మనోజ్ తివారీ, దీపేందర్ సింగ్ హుడా, కె. రామ్ మోహన్ నాయుడు, తేజస్వి సూర్య, రాజీవ్ ప్రతాప్ రూడీ, చంద్రశేఖర్ రావణ్, లవు శ్రీ కృష్ణ, దుష్యంత్ సింగ్, అరుణ్ గోవిల్, మురళీధర్ మోహోల్, రాజేష్ వర్మ, ఓంప్రకాష్ రాజే నింబాల్కర్, దేవేష్ షాక్య, పుష్పేంద్ర సరోజ్, సాగర్ ఈశ్వర్ ఖండారే, నిషికాంత్ దూబే, అప్పల నాయుడు కలిశెట్టి.

రాజ్యసభ ఛైర్మన్ XI టీం..

కిరెన్ రిజిజు (కెప్టెన్), కమలేష్ పాశ్వాన్, మహ్మద్ అజారుద్దీన్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, రాఘవ్ చద్దా, డెరెక్ ఓబ్రెయిన్, నీరజ్ డాంగి, సీఎం రమేష్, సౌమిత్ర ఖాన్, కే సుధాకర్, అనిల్ కుమార్ యాదవ్, విజయ్ కుమార్ దూబే, సురేంద్ర సింగ్ నగర్, నీరజ్ శేఖర్, అశోక్ మిట్టల్, అమర్‌పాల్ మౌర్య, దురై వైకో, తోఖాన్ సాహు, రవి కిషన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..