15 December 2024

పెళ్లైన వ్యక్తితో ఎఫైర్.. 40 ఏళ్ల వయసులో ఒంటరిగా మిగిలిన హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

దక్షిణాది చిత్రపరిశ్రమలో ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని హీరోయిన్. అందం, అభినయంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

ప్లేబ్యాక్ సింగర్‏గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. కొన్నాళ్లు డిప్రెషన్‏లోకి వెళ్లానని చెప్పింది. ప్రస్తుతం ఆమె వయసు 38 సంవత్సరాలు.

ఆమె మరెవరో కాదు. హీరోయిన్ ఆండ్రియా జెరెమియా. కార్తి హీరోగా నటించిన యుగానికి ఒక్కడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. 

2005లో కందా నల్ల ముదల్ సినిమాతో సినీప్రయాణం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఆండ్రియాకు తమిళంలో మంచి ఆఫర్స్ రావడంతో క్రేజ్ పెరిగింది.

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే కొన్ని కారణాలతో సినిమాలకు దూరమయ్యింది. సినిమాలతో కాకుండా తన పర్సనల్ విషయాలతో ఎక్కువగా వార్తలలో నిలిచింది. 

గతంలో ఓ వ్యక్తి వల్ల అనేక ఇబ్బందులు పడ్డానంటూ చెప్పుకొచ్చింది. పెళ్లైన వ్యక్తిని ప్రేమించి, డేటింగ్ చేశానని.. అతడు తనను హింసించినట్లు తెలిపింది.

ఆ టార్చర్ భరించలేక డిప్రెషన్‏లోకి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది. ఆండ్రియాపై అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి. ప్రేమ, బ్రేకప్ స్టోరీలు తెరపైకి వచ్చాయి. 

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‏తో ప్రేమలో పడిందని.. వీరిద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటోస్ అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.