ఎప్పటికీ నీ అభిమానినే.. ఆ టాలీవుడ్ హీరోపై సమంత పోస్ట్
14 December 2024
Basha Shek
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో సమంత కూడా ఒకరు.
తరచూ తన సినిమా విశేషాలతో పాటు గ్లామరస్ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల ఖాతాల్లో షేర్ చేస్తుంటుంది.
అలా తాజాగా ఒక టాలీవుడ్ హీరోను ఉద్దేశిస్తూ సమంత షేర్ చేసిన ఒక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి. శనివారం (డిసెంబర్ 14) ఈ హ్యాండ్సమ్ హీరో పుట్టిన రోజు
ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు రానాకు బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మాత్రం దగ్గుబాటి రానాకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్ట్ షేర్ చేసింది
'హ్యాపీ బర్త్ డే రానా. నువ్వు చేసే ప్రతి పనిలోనూ 100 శాతం ఫోకస్ పెడుతుంటావు. ఈ విషయంలో నీ నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను'
'ఆ దేవుడు ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను' అని రానాకు బర్త్ డే విషెస్ చెప్పింది సమంత.
ఇక్కడ క్లిక్ చేయండి..