Telangana: డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్ చేసిన ఈసీ.. ఆ ఇద్దరికీ కూడా నోటీసులు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ అంజనీకుమార్‌ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు వెళ్లిన మరో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు సంజయ్ కుమార్, మహేష్ భగవత్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Telangana: డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్ చేసిన ఈసీ.. ఆ ఇద్దరికీ కూడా నోటీసులు
DGP - Revanth Reddy
Follow us

|

Updated on: Dec 03, 2023 | 5:47 PM

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ అంజనీకుమార్‌ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు వెళ్లిన మరో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు సంజయ్ కుమార్, మహేష్ భగవత్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద ఈ యాక్షన్ తీసుకుంది ఈసీ. అర్హత ఉన్న పోలీస్ అధికారిని తదుపరి డీజీపీగా నియమించాలని ఈసీ ఆదేశించించినట్లు పీటీఐ వర్గాలు తెలిపాయి.

తెలంగాణ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు నేడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో కొనసాగుతన్న సమయంలో అనూహ్యంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని.. డీజీపీ అంజనీ కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు ఐపీఎస్‌ అధికారులు మహేశ్‌ భగవత్‌, సంజయ్‌ కుమార్‌ కూడా  రేవంత్‌ ఇంటికి వెళ్లారు. డీజీపీ టీపీసీసీ చీఫ్‌కు పుష్ఫగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి.  రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో పోలీస్ ఉన్నతాధికారులు రేవంత్‌ను కలవడంపై ఈసీ సీరియస్ అయ్యింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు పీటీఐ వర్గాలు వెల్లడించాయి. మహేశ్‌ భగవత్‌, సంజయ్‌ కుమార్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్ :