Hyderabad: అభిషేక్‌ను 9 గంటలు విచారించిన ఈడీ.. ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఆదేశం..

మాణిక్ చంద్‌ గుట్కా కేసులో అభిషేక్‌ను 9గంటలపాటు విచారించింది ఈడీ. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి సంబంధించి ఎలాంటి ప్రస్తావన రాలేదన్న అభిషేక్‌.. రేపు మరోసారి ఈడీ విచారణకు పిలిచిందన్నారు.

Hyderabad: అభిషేక్‌ను 9 గంటలు విచారించిన ఈడీ.. ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఆదేశం..
Enforcement Directorate
Follow us

|

Updated on: Dec 23, 2022 | 5:43 AM

మాణిక్ చంద్‌ గుట్కా కేసులో అభిషేక్‌ను 9గంటలపాటు విచారించింది ఈడీ. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి సంబంధించి ఎలాంటి ప్రస్తావన రాలేదన్న అభిషేక్‌.. రేపు మరోసారి ఈడీ విచారణకు పిలిచిందన్నారు. గుట్కా వ్యాపారంపై దర్యాప్తును ముమ్మరం చేశారు ఈడీ అధికారులు. దందాలో నందకుమార్ మోసం చేశాడని బంజారాహిల్స్ పోలీసులకు అభిషేక్ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందని ఇప్పటికే ఈడీ కొంతమందికి నోటీసులిచ్చింది. విచారణకు హాజరుకావాలని గుట్కా సంస్థ డైరెక్టర్ అభిషేక్‌కు నోటీసులివ్వడంతో ఇవాళ ఉదయం 11 గంటలకు.. బ్యాంక్ స్టేట్‌మెంట్స్, ఆస్తుల వివరాలు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్‌ సహా విచారణకు హాజరయ్యారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడైన నందకుమార్ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు అభిషేక్ ఫిర్యాదు చేశారు. తమ సంస్థ మాణిక్‌చంద్ పాన్ మసాలా పేరును 40 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్‌ చేసుకున్నామని.. రెండు కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చి ఆ తర్వాత ముఖం చాటేశాడని ఫిర్యాదులో ఆరోపించారు అభిషేక్‌. ప్రధానంగా నంద కుమార్‌, రోహిత్‌ రెడ్డితో పరిచయాలు.. వ్యాపార లావాదేవీలపై అభిషేక్‌ను ప్రశ్నించారు అధికారులు.

ఈనెల 27న హాజరు కావాలని నోటీసు..

ఇదే కేసులో ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డిని ఇప్పటికే ప్రశ్నించిన ఈడీ అధికారులు.. ఈనెల 27న మరోసారి విచారణకు హాజరుకావాలని సూచించారు. విచారణ కొనసాగుతుండగానే నందకుమార్‌పై మోసం కేసులో ఫిర్యాదు చేసిన అభిషేక్‌ను పిలవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. గంటలకొద్ది సాగిన విచారణలో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, స్థిర, చరాస్తులు, వ్యాపార సంస్థల పై ఈడీ వేర్వేరు కోణాల్లో ఆరా తీసినట్టు సమాచారం. ఇక నెక్స్ట్‌ నోటీసులు ఎవరికి అన్నది ఉత్కంఠగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..