AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరె ఏంట్రా ఇదీ..! నడిరోడ్డు మీద పోలీసులకే చుక్కలు చూపించిన యువకుడు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో మద్యం మత్తులో ఓ యువకుడు నడిరోడ్డుపై సృష్టించిన హంగామా స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. బీర్ బాటిల్‌తో తన పొట్టలో తానే గాయపరుచుకుని సుమారు గంటపాటు ప్రధాన రహదారిపై వీరంగం సృష్టించాడు. చివరకు అతికష్టం మీద అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

అరె ఏంట్రా ఇదీ..! నడిరోడ్డు మీద పోలీసులకే చుక్కలు చూపించిన యువకుడు!
Drunken Youth Creates Havoc
N Narayana Rao
| Edited By: |

Updated on: Jun 16, 2026 | 12:51 PM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో మద్యం మత్తులో ఓ యువకుడు నడిరోడ్డుపై సృష్టించిన హంగామా స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. బీర్ బాటిల్‌తో తన పొట్టలో తానే గాయపరుచుకుని సుమారు గంటపాటు ప్రధాన రహదారిపై వీరంగం సృష్టించాడు. చివరకు అతికష్టం మీద అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

ములకలపల్లి మండలానికి చెందిన వీరయ్య అనే వ్యక్తి తీవ్ర మద్యం మత్తులో సారపాక ప్రధాన రహదారిపైకి వచ్చాడు. మద్యం మత్తులోనే బీర్ బాటిల్‌తో తన పొట్టలో పొడుచుకోవడంతో రక్తస్రావం జరిగింది. అయితే గాయాల తీవ్రతను కూడా పట్టించుకోకుండా రోడ్డుపైనే తిరుగుతూ గందరగోళం సృష్టించాడు. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడిని రోడ్డు నుంచి పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల మాటను ఏమాత్రం ఖాతరు చేయకుండా వారిపైనే ఎదురు తిరిగాడు. మద్యం మత్తులో ఉన్న అతడు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు స్థానికుల సహకారంతో పోలీసులు వీరయ్యను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. గట్టిగా పట్టుకుని బంధించిన అనంతరం అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు.

యువకుడి హంగామాతో సుమారు గంటపాటు ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత పరిస్థితి సద్దుమణిగి ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకుంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us