AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Riding Tips: వర్షంలో బైక్ డ్రైవ్ చేయడం కష్టంగా ఉందా..? ఈ టిప్స్‌తో మీరు సేఫ్‌గా వెళ్లొచ్చు..

వర్షాకాలం వచ్చేసింది. దీంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు డ్రైవ్ చేయడం కష్టంగా మారింది. గుంతల్లోకి నీళ్లు చేసుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటి అనేది చూద్దాం.

Bike Riding Tips: వర్షంలో బైక్ డ్రైవ్ చేయడం కష్టంగా ఉందా..? ఈ టిప్స్‌తో మీరు సేఫ్‌గా వెళ్లొచ్చు..
Bike Driving
Venkatrao Lella
|

Updated on: Jun 16, 2026 | 12:42 PM

Share

నైరుతి రుతుపవనాల రాకతో వానాకాలం సీజన్ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించాయి. దీంతో గత కొద్దిరోజులుగా ఏపీ, తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో కొద్ది రోజుల్లో భారీ వర్షాలు మొదలుకానున్నాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు.. బైక్ డ్రైవ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడం, గుంతల రోడ్ల వల్ల బైక్ డ్రైవింగ్ ఇబ్బందిగా ఉంటుంది. బైక్ ఇంజిన్లలోకి నీరు చేరుకుని మధ్యలో ఆగిపోవడం, ఇంజిన్ స్టార్ట్ కాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.

సడెన్ బ్రేకులు వేయవద్దు

వర్షాలు పడే సమయంలో రోడ్లన్నీ జలమయంతో ఉంటాయి. రోడ్లన్నీ తడిసిపోయి కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో సడెన్ బ్రేకులు వేయడం వల్ల బైక్ జారిపోయి ప్రమాదం జరిగే అవకాశముంటుంది. అందుకే వర్షాల సమయంలో అకస్మాత్తుగా బ్రేకులు వేయవద్దు. ఇక మలుపుల్లో బ్రేకులు అసలు వేయకండి. బైక్ జారిపోకుండా ఉండాలంటే ముందు, వెనుక బ్రేక్ లివర్లను ఒకసారి నొక్కండి.

టైర్ల విషయంలో జాగ్రత్త

చాలామంది అరిగిపోయిన, పాడైపోయిన టైర్లను వాడుతూ ఉంటారు. వర్షాల సమయంలో ఇలాంటి టైర్ల వల్ల బైక్ జారిపోయే అవకాశం ఉంటుంది. దీని వల్ల మీరు ప్రమాదం బారిన పడతారు. అందువల్ల మీ టైర్ల సామర్థ్యాన్ని పరిశీలించండి. బాగా పట్టు ఉన్న టైర్లను మాత్రమే వినియోగించండి. ఆరిగిపోయిన టైర్లను మార్చండి.

నీటిలో బైక్ నడపొద్దు

ఇక వర్షాల సమయంలో రోడ్లపైకి నీళ్లు చేరుకుంటాయి. గుంతల్లోకి నీళ్లు చేసుకోవడం వల్ల బైక్ నడిపే సమయంలో జారి కింద పడే అవకాశముంటుంది. అందుకే గుంతల రోడ్లపై బైక్ నడపడం, నీళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం లాంటివి చేయకూడదు. అంతేకాకుండా ఎగ్జాస్ట్‌లోకి నీళ్లు వెళ్లిపోయి వెహికల్ ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

స్పీడ్ వెళ్లవద్దు

ఇక వర్షాల సమయంలో బైక్ స్పీడ్‌గా నడపవద్దు. రోడ్లపై బైక్ పట్టు తప్పినప్పుడు మీకు నియంత్రణ ఉండదు. భారీ వర్షాల సమయంలో రోడ్లపై ఎక్కువ ఏముందనేది కనిపించదు. దీంతో తక్కువ స్పీడ్‌తో వెళ్లండి. ఇక హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. ఇక హెల్మెట్ విండ్ షీల్డ్‌ను క్లీన్ చేసేందుకు ఫింగర్ వైపర్లను ఉపయోగించండి. కార్లలోని విండ్ స్క్రీన్ మాదిరిగానే ఇవి పనిచేస్తాయి. వర్షాల సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్లన ప్రమాదాల బారిన పడకుండా సేఫ్‌గా బైక్ డ్రైవ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Follow Us