DK Aruna: గద్వాల జేజమ్మకు కోపం వచ్చింది.. బీజేపీ చీఫ్‌పై డీకే అరుణ గరం గరం..!
Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై గరం గరంగా ఉన్నరంటా డీకే అరుణ (DK Aruna).. సంజయ్ పోకడలపై కారాలు మిరియాలు నురుతున్నారంటా..
Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై గరం గరంగా ఉన్నరంటా డీకే అరుణ (DK Aruna).. సంజయ్ పోకడలపై కారాలు మిరియాలు నురుతున్నారంటా.. ఫోన్ కాల్ దూరంలో ఉన్న తనకు తెలియకుండానే అన్ని జరుగుతున్నాయని సంజయ్ (Bandi Sanjay) పై గద్వాల జేజమ్మ మండిపడుతున్నారంట.. బీజేపీలో చేరిన ఓ కొత్త వ్యక్తితో ఈ ఇద్దరి నేతల మధ్య మరింత దూరం పెంచిందని పార్టీ వర్గాల సమాచారం. అసలు ఇంతకీ డీకే అరుణ కోపానికి కారణమైన చర్చ ఎంటీ..? అసలు దీనికి కారణం ఎవరు అనేది.. తెలుసుకోవాలంటే ఈ వార్త చదవండి.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఎన్ఆర్ఐ బాలా త్రిపురసుందరి జనవరి 27వ తేదీన బీజేపీ(BJP) లో చేరారు. బండి సంజయ్ సమక్షంలో ఆమే కషాయ కండువా కప్పుకున్నారు. కానీ ఆమే జాయినింగ్ మీద బీజేపీ నేతల మధ్య విభేదాలు సృష్టించింది. అధ్యక్షుడు బండి తనను సంప్రదించకుండా, చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ మండిపడుతున్నారు. బాలా త్రిపురసుందరిని పార్టీలో చేరె రోజు అక్కడ ఉండాల్సిన డీకే ఆరుణ రాలేదు.. దీంతో ఇప్పుడు ఈ విషయం కషాయ సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్ఆర్ఐ బాలా త్రిపురసుదరి కొంత కాలం క్రితం స్వదేశానికి వచ్చి వ్యపారం,సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న తర్వాత జిల్లా అధ్యక్షుడిని, బండి సంజయ్‌ను కలిసారు. అయితే సంజయ్ ఒకసారి డికే అరుణను కూడా కలిసి రావాల్సిందిగా ఆమెకు సూచించారు. కానీ ఆమే డీకే అరుణతో కలిసి పార్టీలోకి రావలనుకుంటున్నాని చెప్పారు. అయితే.. బండి సంజయ్, బిజేపి రాష్ట్ర పార్టీ ఈ విషయంపై అరుణతో కనీసం సంప్రదించకుండానే.. మాట్లడకుండానే ఆమెకు జాయినింగ్ డేట్ ఇచ్చారు. ఈ క్రమంలో సరిగ్గా జాయినింగ్‌కు గంట ముందుకు పార్టీలోని ఓ ప్రాధన కార్యదర్శి డీకే అరుణకు ఫోన్ చేసి జాయినింగ్ కార్యక్రమానికి మీరు వస్తున్నారా..? అని అడగారంట.. అయితే ఎవరి జాయినింగ్ అంటూ డికే అరుణ బదులిచ్చారు. దీంతో ఆమె లేకుండానే జాయినింగ్ కార్యక్రమం అయిపోంది.
గతంలో కూడా అరుణతో మాట్లడకుండానే బండి పాదయాత్ర రెండవ దశను అలంపుర్ నుంచి ప్లాన్ చేస్తూ ప్రకటించారు. అయితే కోవిడ్ వల్ల అది ముందకు సాగలేదు. ఈ విషయంపై అప్పుడు కుడా డీకే అరుణ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఈ విషయం మళ్లీ ఇద్దరు నేతల మధ్య దూరం పెంచిందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బండి సంజయ్ పోకడలు డీకే అరుణకు నచ్చడం లేదని.. కనీసం ఫోన్ చేసి కూడా మాట్లాడలెనంతగా బిజీగా ఉంటే ఎలా అంటూ ఆమె మండిపోతున్నారని అరుణ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలంటే అనుభవం ఉన్న తమ లాంటి వారిని కనీసం సంప్రదించాలి కదా… ఇలా అయితే ఎలా అంటూ పార్టీలోని పలువురు చర్చించుకుంటున్నారని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వివాదంపై బండి సంజయ్ ఎలా పరిష్కరిస్తారనేది పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: