Telangana: మృగశిర కార్తె.. మంచి చేపలు పడతాయి అనుకుని వల వేశారు.. చిక్కినవి చూసి స్టన్
తొలకరి పులకరింపులను మోసుకొచ్చే 'మృగశిర కార్తె' రోజున చేపలు తినడం తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటినుంచో ఉన్న ఆనవాయితీ.. దీంతో సహజంగానే ఆ రోజున చేపలకు మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే అక్కడి జాలర్లు నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చని స్థానిక చెరువులో వల వేశారు. చిక్కినవి చూసి స్టన్ అయ్యారు.

జూన్ 8 వ తేదీ నుంచి మృగశిర కార్తె ఎంటరయ్యింది. మృగశిర కార్తె రోజున చేపలు తినాలనేది తెలుగు రాష్ట్రాల్లో బలమైన సెంటిమెంట్. దీంతో ఆ చెరువులో చేపల పట్టి కాస్త పొట్ట పోసుకోవచ్చు అనుకున్నారు జాలర్లు. శనివారం రోజున చర్లపల్లి చెరువులో చేపల కోసం వల వేసిన జాలర్లకు ఊహించని ఝలక్ తగిలింది. వలలో టన్నుల కొద్దీ డెవిల్ ఫిష్ కనిపించారు. దీంతో మృత్స్యకారులను తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
డెవిల్ ఫిష్ అనేది మాముల్ది కాదు. ఇది స్థానికమైన చేపలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇవి ఎక్కువగా ఇతర చేప పిల్లలను తింటూ చెరువులోని జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తాయి. అందుకే స్థానిక జాలర్లు వాపోతున్నారు. ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన చేప పిల్లలను చెరువులో వదిలినప్పటికీ.. డెవిల్ ఫిష్ ఆ చేపలను తిని చెరువులో తమ సంతతిని పెంచుకుంటున్నట్లు చెబుతున్నారు. డెవిల్ ఫిష్‌లో నాణ్యమైన పోషకాలేమీ ఉండవు. ఇవి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రోటీన్ లేకపోవడం.. పొటాషియం, సోడియం స్థాయిల సమతుల్యత లేకపోవడం కారణంగా ఇవి ఆహారానికి అనుకూలం కావు. ఇవి ఇతర చేపల సంఖ్యను తగ్గించి.. మృత్స్యకారుల పొట్ట కొడతాయి. అంతేకాదు ఇవి డ వేగంగా పెరిగ.., పెద్దసైజులోని చేపలను తినేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. వీటిని నియంత్రించకపోతే ఆ చెరువులో మరో చేప బతికే చాన్సే ఉండదు.
చర్లపల్లి మృత్స్యకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈగ సత్యనారాయణ, కార్యదర్శి విజయ్‌కుమార్‌లు మాట్లాడుతూ… డెవిల్ ఫిష్ చెరువులోని చేపల నష్టానికి ప్రధాన కారణమని తెలిపారు. గత ఆరు నెలల క్రితం 3.5 లక్షల రూపాయల విలువైన చేప పిల్లలను చెరువులో వదిలినప్పటికీ.. వాటిని కాపాడుకోవడం పెద్ద టాస్క్ అయిందని చెబుతున్నారు. సంబంధిత జిల్లా అధికారులను చెరువును సందర్శించి, డెవిల్ ఫిష్ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Devil Fish
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..