AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: నియోజకవర్గ ఇంఛార్జ్‌ అంటూ గొంతమ్మ కోరికలు.. ఎన్నికల పేరుతో రాజబోగలు..!

భారత రాష్ట్ర సమితి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకుంటుంది. ఎన్నికల కోసం అభ్యర్థికి చేదోడు వాదోడుగా ఉండేందుకు పార్టీలో ఉండే ఇతర ముఖ్య నేతలను అయా నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు గులాబీ బాస్ కేసీఆర్. రాష్ట్ర పార్టీని నియోజకవర్గ నేతలను ఎమ్మెల్యే అభ్యర్థిని సమన్వయం చేసుకునేందుకు ఇన్‌ఛార్జ్‌ పనిచేయాలి. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు వార్‌రూమ్‌కి చెప్పడంతో పాటు.. అధిష్టానం ఇచ్చే ఆదేశాలను తుచ తప్పకుండా పాటించేలా చూడాలి.

Telangana Election: నియోజకవర్గ ఇంఛార్జ్‌ అంటూ గొంతమ్మ కోరికలు.. ఎన్నికల పేరుతో రాజబోగలు..!
Brs Party
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Nov 17, 2023 | 10:20 AM

Share

భారత రాష్ట్ర సమితి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకుంటుంది. ఎన్నికల కోసం అభ్యర్థికి చేదోడు వాదోడుగా ఉండేందుకు పార్టీలో ఉండే ఇతర ముఖ్య నేతలను అయా నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు గులాబీ బాస్ కేసీఆర్. రాష్ట్ర పార్టీని నియోజకవర్గ నేతలను ఎమ్మెల్యే అభ్యర్థిని సమన్వయం చేసుకునేందుకు ఇన్‌ఛార్జ్‌ పనిచేయాలి. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు వార్‌రూమ్‌కి చెప్పడంతో పాటు.. అధిష్టానం ఇచ్చే ఆదేశాలను తుచ తప్పకుండా పాటించేలా చూడాలి. అంతేకాదు రాష్ట్ర నాయకత్వం నుం నుంచి వచ్చే నేతల ప్రచార కార్యక్రమాలు కూడా చూడాలి. ఓవరాల్ గా కోఆర్డినేషన్ ఇన్‌ఛార్జ్‌ బాధ్యత.

కానీ గొంతెమ్మ కోరికలతో నియోజకవర్గ అభ్యర్థులను ఇబ్బందులు పెడుతున్నారట ఈ ఇన్‌ఛార్జ్‌లు. తమ పరిధి దాటి ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే ఎక్కువ చేస్తున్నారనేదీ ఫిర్యాదు. స్థానిక అవగాహన లేకపోయినా అన్నింటిలో వేలు పెట్టి అసలుకే మోసం వచ్చేలా ప్రవర్తిస్తున్నారట. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అభ్యర్థికి సహకరించడం సొంతంగా సమావేశాలు పెడుతూ గ్రూపులకు అక్కడ ఇన్‌ఛార్జ్‌ని మార్చేశారు. మరో వ్యక్తికి సాగర్ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. అభ్యర్థితో పార్టీ కేడర్ కలుపుకునిపోయేలా చర్యలు చేపట్టింది అధిష్టానం. 2018 ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో మొన్ననే ఉప ఎన్నికలు జరిగిన ఓ నియోజకవర్గంలో అప్పుడు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న వ్యక్తి వల్లే ఆ సీటు కోల్పోయింది పార్టీ. ఇప్పుడు ఆ వ్యక్తికి ఎక్కడ ఇన్‌ఛార్జ్‌ బాధితులు ఇవ్వలేదు.

ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ కొత్త క్యాండిడేట్‌కు సోషల్ మీడియా కోసం కోటి రూపాయల ఖర్చు చూపించారట సహా ఇన్‌ఛార్జ్‌. హైదరాబాద్ సిటీలో ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న ఓ ముఖ్య నేత తన కోసమే ప్రత్యేకంగా వాహనం, స్టాప్, ఆఫీస్ కావాలని అడిగి అభ్యర్థిని ఇబ్బంది పెట్టాడు. ఇక ఇదే గ్రేటర్ హైదరాబాద్‌లో మరొక ఇన్‌ఛార్జ్‌ రోజు అభ్యర్థిని ఖర్చుల కోసం భారీ ఎత్తున డబ్బులు వసూళ్ళు చేస్తూ వేధిస్తున్నాడట.

ఇలా సహాయంగా ఉండాల్సిన ఇన్‌ఛార్జ్‌లు వేధించుకు తింటుంటే ఏం చేయాలో అర్థం కాక అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు అభ్యర్థులు. ఇప్పటికే ఒకరిద్దరు ఇన్‌ఛార్జ్‌లను పక్కన పెట్టిన హై కమాండ్ ఇంకొంతమందిని నియోజకవర్గానికి వెళ్లకుండా హైదరాబాద్ వార్ రూమ్‌లో పని చేయమని చెప్పినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…