Telangana: ఓట్ల పండుగ.. ఎన్నికల జాతరలో హోటల్స్‌కి పెరిగిన గిరాకీ.. ఫుల్‌ డిమాండ్‌ పలుకుతున్న ఫుడ్‌ సప్లయర్స్‌..

| Edited By: Jyothi Gadda

Nov 12, 2023 | 11:08 AM

సాయంత్రం అయ్యింది.. ప్రచారం ముగిసింది ఇంకా మనకెందుకులే రేపు చూస్కుందాం అంటే కుదరదు.. రాత్రికి కూడా ఓ బిర్యానీ ప్యాకెట్.. కావాలంటే ఓ బీర్ బాటిల్ కూడా ఇవ్వాల్సిందే. లేదంటే రేపటి నుంచి ప్రచారానికి రామని చెప్పేస్తున్నారు. మొత్తంగా ఎన్నికలు ఇటు ప్రచారానికి వెళ్లే వారికి కడుపును నింపుతూ.. ఫుడ్ క్యాటరర్స్.. హోటల్స్కి కాసులు నింపుతున్నాయి..

Telangana: ఓట్ల పండుగ.. ఎన్నికల జాతరలో హోటల్స్‌కి పెరిగిన గిరాకీ.. ఫుల్‌ డిమాండ్‌ పలుకుతున్న ఫుడ్‌ సప్లయర్స్‌..
Hotels
Follow us on

హైదరాబాద్,నవంబర్12; తెలంగాణలో ఎన్నికల జాతర జరుగుతోంది. ఏ ఊరు వాడా చూసిన జనం, కార్యకర్తలు, నేతల ప్రచారంతో సందడి నెలకొని ఉంది. ఇక ప్రచారంలో కార్యకర్తలకు నెలరోజుల పాటు అన్నీతామై చూసుకుంటారు నేతలు. తెల్లవారింది మొదలు..సాయంత్రం వరకు ప్రచారం కొనసాగుతుంది. వందల సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనేందుకు జనాలను.. తమ కార్యకర్తలను పోగు చేసి తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు నేతలు. ఇలాంటప్పుడు వాళ్లందరి కడుపు నింపాల్సిన బాధ్యత కూడా వారిదే.. మూడు పూటల కడుపు నిండా అన్నం పెట్టాలి. ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం బిర్యానీ.. రాత్రి కూడా బిర్యానీ ఇస్తున్నారు.. కొందరైతే విందు తో పాటు తాగేవారికి మందు కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు హోటల్స్ కి మంచి గిరాకీ తెచ్చిపెడుతున్నాయి. తమతో ప్రచారానికి వచ్చే కార్యకర్తలకు మూడు పూటలా ఫుడ్ పెడుతున్నారు నేతలు.. ఇది కాస్త హోటల్స్ కి కాసులు కురిపిస్తుంది. పైగా సభలు, సమావేశాలకు వచ్చె వారికి తప్పనిసరిగా విందు ఏర్పాటు చేస్తుండగా, హోటల్స్ తో పాటు క్యాటరింగ్ లకి కూడా ఆర్డర్స్ పెరుగుతున్నాయి.

ప్రచార సమయాల్లో ప్రత్యేకించి భోజనాలు తయారు చేయించే పరిస్థితి ఉండదు.. కాబట్టి..ఎన్నికలు ముగిసే వరకు హోటల్స్ కి.. క్యాటరింగ్ వాళ్లకి ఆర్డర్స్ ఇస్తున్నారు నేతలు. టిఫిన్స్.. భోజనం.. బిర్యానీ ఇలా అన్నింటికి కలిపి రోజుకు దాదాపు 100 నుంచి 500, వెయ్యి ప్లేట్స్ వరకు రెడీ చేస్తూ సప్లై చేస్తున్నాయి హోటల్స్ ఇంకా క్యాటరింగ్ సర్వీసులు. మామూలుగా బయట ఉండే రేటు కాకుండా కాస్త తగ్గించి ఇస్తున్నారు. తక్కువలో తక్కువ అనుకున్నా రోజుకు లక్ష రూపాయల ఆర్డర్స్ కు తగ్గడం లేదు.. ఈ లెక్కన చూసుకుంటే ఎన్నికలు ముగిసే వరకు దాదాపు ముప్పై లక్షల వరకు సంపాదిస్తారు హోటల్స్.. క్యాటరింగ్ నిర్వాహకులు. ఇంకా కొంచం పేరున్న హోటల్ అయితే ఆ లెక్క పెరుగుతుంది.

ఫుడ్ పెడితే అయిపోతుందా ..?  అది బాగుండాలి.. లేదంటే మాకొద్దు అనేస్తున్నారు కార్యకర్తలు.. ప్రచారానికి వచ్చిన జనాలు. దీంతో రేట్ ఎక్కువ ఐన పర్వాలేదు కానీ క్వాలిటీలో తగ్గకూడదని నేతలు జాగ్రత్త పడుతూ తమకు ఎక్కడ రీమార్క్ రాకుండా చుసుకుంటున్నారు.. కార్యకర్తలకు మా నాయకుడు ఏ మాత్రం తక్కువ చేయట్లేదు అనేలా చూసుకుంటున్నారు లీడర్లు. కొందరు బిర్యాని ఆర్డర్స్ చేస్తే..  కొందరు మాత్రం స్ఫెషల్ మెనూ ,ఐదు రకాల వంటకాలు ఆర్డర్స్ ఇస్తూ ఎక్కడా తగ్గకేండా తమగురించి గొప్పగా  చెప్పుకోనెలా చెసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

సాయంత్రం అయ్యింది.. ప్రచారం ముగిసింది ఇంకా మనకెందుకులే రేపు చూస్కుందాం అంటే కుదరదు.. రాత్రికి కూడా ఓ బిర్యానీ ప్యాకెట్.. కావాలంటే ఓ బీర్ బాటిల్ కూడా ఇవ్వాల్సిందే. లేదంటే రేపటి నుంచి ప్రచారానికి రామని చెప్పేస్తున్నారు. మొత్తంగా ఎన్నికలు ఇటు ప్రచారానికి వెళ్లే వారికి కడుపును నింపుతూ.. ఫుడ్ క్యాటరర్స్.. హోటల్స్కి కాసులు నింపుతున్నాయి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…