Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ ఐదు వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలి…
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో ఉప్పు, చక్కెరను తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. మీరు తినే ఆహారంలో ఉప్పును, చక్కెరను తగిన మోతాదు కంటే కూడా తక్కువ మొత్తంలోనే తీవ్యాధిగ్రస్తులు తీసుకోకూడదు. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులు చేయకూడని ప్రధానమైన తప్పులు. మరి డయాబెటిస్ పేషెంట్స్.. వీటి విషయంలో ఎప్పటికీ జాగ్రత్తగా ఉండండి.
మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆహారపు అలవాట్లపైన జాగ్రత్తలు వహించాలని పదే పదే ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధుమేహాన్ని జీవనశైలి వ్యాధిగా పరిగణిస్తారు. అయితే, ప్రస్తుత రోజుల్లో మధుమేహం చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. మధుమేహ బాధితులు గతం కంటే కాస్త ఎక్కువ జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. మధుమేహం కలిగించే సంబంధిత సమస్యలు, ఇతర సైడ్ ఎఫెక్ట్స్, వ్యాధుల పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. లేదంటే, మధుమేహం అనియంత్రితంగా పెరిగిపోతే.. అది క్రమంగా అనేక ఇతర అవయవాలు, శారీరక విధులను ప్రభావితం చేస్తుంది. మధుమేహం ఉన్నవారు తెలుసుకోవలసిన కొన్ని ఇతర వ్యాధులు, పరిస్థితులు ఎలా ఉంటాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
మధుమేహ వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా గుండె జబ్బులు లేదంటే గుండె ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ప్రభావితం చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం గుండెపోటు, స్ట్రోక్ వంటి పరిస్థితులకు దారి తీస్తుంది. అందుకే వీటన్నింటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ శరీరంలో చక్కెర స్థాయిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవటం మంచిది. రక్తంలో పెరిగిన ఎక్కువ చక్కెర స్థాయిలు శరీరంలోని అనేక అవయవాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక ఈ విషయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
రక్తంలో చక్కెర ఎక్కువైనప్పుడు అది మూత్రపిండాలకు కూడా సమస్యలను కలిగిస్తుంది. సరైన సమయంలో చికిత్స చేయకుండా వదిలేస్తే, డయాలసిస్ – లేదా కిడ్నీ మార్పిడికి కూడా దారితీసే సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు.. మధుమేహం బాధితుల్లో దృష్టిని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితిని ‘డయాబెటిక్ రెటినోపతి’ అంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులను ప్రభావితం చేసే మరొక పరిస్థితి డయాబెటిక్ న్యూరోపతి, లేదా మధుమేహం నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే పరిస్థితి. దీని వల్ల కాళ్లలో తిమ్మిరి, జలదరింపు వంటి సమస్యలన్నీ కనిపిస్తాయి. ఇది కూడా ఆరోగ్యానికి పెను ముప్పు తెచ్చే పరిస్థితి.
మధుమేహం, ఊబకాయం దగ్గరి సంబంధం ఉన్న అనారోగ్య సమస్యలు. స్థూలకాయులలో మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మధుమేహం ఉన్నవారు తర్వాత కాలంలో ఊబకాయానికి గురవుతారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు స్థూలకాయాన్ని నివారించడానికి ఆహారం, వ్యాయామంపై చాలా శ్రద్ధ వహించాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో ఉప్పు, చక్కెరను తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. మీరు తినే ఆహారంలో ఉప్పును, చక్కెరను తగిన మోతాదు కంటే కూడా తక్కువ మొత్తంలోనే తీవ్యాధిగ్రస్తులు తీసుకోకూడదు. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులు చేయకూడని ప్రధానమైన తప్పులు. మరి డయాబెటిస్ పేషెంట్స్.. వీటి విషయంలో ఎప్పటికీ జాగ్రత్తగా ఉండండి.