Dangerous Driving: నువ్వు దేవుడు సామి.. ఆవును బైకుపై ఎక్కించుకుని డ్రైవింగ్.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు!

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. వినియోగదారులు తమ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.. ఆ వ్యక్తి బైక్‌పై ఆవును ఎలా కూర్చోబెట్టి ఉంటాడని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో మిలియన్ల మంది చూశారు. వేలాది మంది వినియోగదారులు దీన్ని లైక్ చేశారు. రకరకాల కామెంట్లు, విమర్శలతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

Dangerous Driving: నువ్వు దేవుడు సామి.. ఆవును బైకుపై ఎక్కించుకుని డ్రైవింగ్.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు!
Man Ride Bike With Cow
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 12, 2023 | 8:25 AM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వింత, ఫన్నీ వీడియోలు కనిపిస్తాయి. వాటిని చూసిన ప్రతి ఒక్కరూ నవ్వు ఆపుకోలేకపోతుంటారు.. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మరో ఫన్నీ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో ఒక వ్యక్తి అన్ని డ్రైవింగ్ పరిమితులను దాటేసి ప్రవర్తించాడు.. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి మోటారుసైకిల్‌పై ఏకంగా ఒక ఆవును కూర్చోబెట్టుకుని ప్రయాణిస్తున్నాడు.. బైక్‌ ముందు భాగంలో ఆవును చిన్నపిల్లలా కూర్చుబెట్టుకుని, అతడు జాలిగా బైక్‌ రైడ్‌ చేస్తుండగా, ఆవు కూడా ఏం చక్కా ఎంజాయ్‌ చేస్తూ కనిపించింది. ఈ వీడియోలో అతని డ్రైవింగ్ స్కిల్‌ని పరిచయం చేస్తుంది. ఇంత చిన్న వాహనంపై అంత పెద్ద జంతువును ఎక్కించుకుని వెళ్తున్న అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీడియో చూసిన యూజర్లు షాక్ అయ్యారు.

అయితే, గతంలో మీరు మేకలు, కుక్కలు లేదా పిల్లులు బైక్‌లపై ప్రయాణించడం చూసి ఉంటారు. ఇలాంటి పెంపుడు జంతువులు చిన్నగా ఉంటాయి. మనుషులు వాటిని సులువుగా ఎత్తుకుని ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు వీలుగా ఉంటుంది. కాబ్టటి ఇలాంటి చిన్ని చిన్న పెంపుడు జంతువులను జనాలు తమ వాహనాలపై వెంట తీసుకువెళ్తుంటారు. కానీ, ఇలా ఆవును బైక్‌పై ఎక్కించుకుని ట్రావెల్‌ చేయటమం అంటే నిజంగా విచిత్రమే మరీ. అతడు ఆవును బైక్‌పై తన ముందు అచ్చం తన చంటిబిడ్డను ఎలాగైతే కూర్చొబెట్టుకుని తీసుకువెళ్తాడో.. అలాగే..ఆవును కూర్చోబెట్టుకుని వెళ్తున్నాడు. అయితే అతడు చేసిన ఈ వింత విన్యాసాన్ని కొందరు వాహనదారులు, ప్రయాణికులు వీడియో తీశారు. అనంతరం సోషల్ మీడియాలో అప్‌ లోడ్‌ చేయటంతో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వ్యక్తి తన బైక్‌లో ముందు సీటుపై ఆవును మోసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. పైగా అతడు ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కి అతి వేగంగా బైక్ నడుపుతున్నాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ ఆవు కూడా అతన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. అయితే ఆవు ఏమాత్రం ఎగిరినా, కాస్త అటు ఇటు కదిలి ఉంటే కూడా ప్రమాదం జరిగి ఉండేది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. వినియోగదారులు తమ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.. ఆ వ్యక్తి బైక్‌పై ఆవును ఎలా కూర్చోబెట్టి ఉంటాడని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో మిలియన్ల మంది చూశారు. వేలాది మంది వినియోగదారులు దీన్ని లైక్ చేశారు. రకరకాల కామెంట్లు, విమర్శలతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?