ఆ ఊరిలో ఉన్నది ఒకే ఒక్క మహిళ.. ఊరినిండా తోడేళ్ల అరుపులే..! భయం.. ఆమె డిక్షనరీలో లేదట..

ఇక ఊరిలో ఒంటరిగా జీవిస్తున్న జోసెట్ ప్రశాంతతకు తోడేళ్ల అరుపులతో ఎలాంటి భయం, ఇబ్బంది లేకుండా గడుతున్నారు. కానీ, తన ఇంటి కెమెరాలో చాలా తోడేళ్లను చూసినా జోసెట్‌ ఇప్పటి వరకు ఏ తోడేలు తనవైపు రాలేదని, ఎలాంటి హాని కలిగించలేదని చెప్పింది. అయితే, ఈ గ్రామంలోని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపై జనాభా మూడు రెట్లు పెరుగుతుందని అభిమానులు తెలిపారు.

ఆ ఊరిలో ఉన్నది ఒకే ఒక్క మహిళ.. ఊరినిండా తోడేళ్ల అరుపులే..! భయం.. ఆమె డిక్షనరీలో లేదట..
France Weird Village
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 11, 2023 | 2:03 PM

విశ్వంలో ప్రతి ఒక్కరికీ వారి స్వంత వ్యక్తిత్వం ఉంటుంది. కొంతమంది వ్యక్తులు అందరితో కలిసి జీవించడానికి ఇష్టపడతారు. మరికొందరు ప్రజలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. నిశ్శబ్ద వాతావరణంలో ఒంటరిగా జీవించడంమే వారికి ఇష్టం.. ఒంటరిగా ఉన్నామనే భయం కూడా వారిలో ఉండదు. ఇక్కడ కూడా ఓ మహిళ సమాజానికి దూరంగా ఒంటరిగా నివసిస్తోంది. ఆ మహిళ నివసిస్తున్న గ్రామం ఫ్రాన్స్‌లో ఉంది.. ఇక్కడ అత్యంత విచిత్రమైన గ్రామం ఇది. ఇక్కడ జనాభా ఒక్కరే. శ్మశానవాటిక, చర్చి, తోడేలు ఉన్న మహిళ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ధైర్యానికి ప్రపంచ వ్యాప్తంగా ఆమెను మెచ్చుకుంటున్నారు. ఆ గ్రామం విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఫ్రాన్స్‌లోని ఒక విచిత్ర గ్రామంలో నివసిస్తున్నారు జోసెట్ అనే మహిళ. ఆ గ్రామం పేరు రోచెఫోర్‌చాట్. దీనిని మిడిల్ ఆఫ్ నోవేర్ అని కూడా అంటారు. ఈ గ్రామంలో స్త్రీ ఇంకా తోడేలు మాత్రమే నివసిస్తున్నారు. రోచెఫోర్ట్‌చాట్ గ్రామంలో కేవలం 65 ఏళ్ల జోసెట్టే నివసిస్తున్నారు. ఈ గ్రామంలో ఆమె తప్ప మరెవరూ కనిపించరు.. అక్కడ మనుషులు నివసించరు. ఇంట్లోనే కాదు ఊరంతా ఒంటరిగా బతుకుతున్న జోసెట్‌కి భయం లేదు. ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి.

ఈ గ్రామంలో ఇంకా ఒక పాత చర్చి, స్మశానవాటిక, టెలిఫోన్ బూత్ ఉన్నాయి. ఫ్రాన్స్‌లో మొత్తం 35,083 మునిసిపాలిటీలు ఉన్నాయి . వీటిలో రోచెఫోర్‌చాట్ అతి చిన్న మునిసిపాలిటీ. జోసెట్ ఇల్లు, తోడేలు మినహా మొత్తం గ్రామంలో పాత చర్చి ఉంది. టెలిఫోన్ బూత్ కూడా ఉంది. అక్కడ మరో నాలుగైదు ఇండ్లు కూడా ఉన్నాయి. కానీ అందులోనూ ఎవరూ ఉండదరు..మేయర్ జీన్ బాప్టిస్ట్ డి మార్టిగ్నీతో సహా కొందరు అప్పుడప్పుడు అతని ఇంటికి వస్తుంటారు. జోట్స్‌కు మూడు ఇళ్లు ఉన్నాయి. జోసెట్ 2005 నుండి ఇక్కడ నివసించడం ప్రారంభించింది. జోసెట్ నెలలో పదిహేను రోజులు రోచెఫోర్‌చాట్‌లో నివసిస్తుంది. మరో పదిహేను రోజులు ప్రజలు నివసించే గ్రామంలో నివసిస్తుంది. ఇలా ఎందుకు ఒంటరిగా ఉంటున్నారని అడిగితే.. తాను, విలాసవంతమైన జీవితం కంటే శాంతిని ఇష్టపడతాను అని చెప్పింది జోసెట్‌. కాబట్టి నేను వచ్చి పక్షం రోజులు రోచెఫోర్‌చాట్‌లో నివసిస్తాను అని చెప్పారు. తాను గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్నాను కాబట్టి, తాను సన్యాసిని కానని చెప్పింది. ఆమె ఒక కుక్కను కూడా పెంచుకుంటోంది. కుక్క కూడా ఆమెతో పాటు రోచెఫోర్‌చాట్‌లో 15 రోజులు గడుపుతుంది. రోచెఫోర్‌చాట్‌లో భోజనం, ఆహార సంబంధిత వస్తువులు అందుబాటులో ఉండవు. దానికోసం జోసెట్ ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామానికి వెళ్లి ఆహారం తెచ్చుకుంటుంది.

ఇవి కూడా చదవండి

జోసెట్ రోచె‌ఫోర్‌చాట్‌లో నివసిస్తున్నందున, ఆమె కుటుంబం తరచుగా ఆమెను చూసేందుకు వస్తుంటారు.. నాలుగైదు రోజులు అక్కడే ఉండే కుటుంబ సభ్యులు అడవి పందుల వేటకు వెళుతుంటారు. ఇక ఊరిలో ఒంటరిగా జీవిస్తున్న జోసెట్ ప్రశాంతతకు తోడేళ్ల అరుపులతో ఎలాంటి భయం, ఇబ్బంది లేకుండా గడుతున్నారు. కానీ, తన ఇంటి కెమెరాలో చాలా తోడేళ్లను చూసినా జోసెట్‌ ఇప్పటి వరకు ఏ తోడేలు తనవైపు రాలేదని, ఎలాంటి హాని కలిగించలేదని చెప్పింది.

అయితే, ఈ గ్రామంలోని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపై జనాభా మూడు రెట్లు పెరుగుతుందని అభిమానులు తెలిపారు. వార్త పాతదే అయినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలు, ఫోటోల ద్వారా మరోమారు వార్తల్లో నిలిచింది. ఇది చూసిన చాలా మంది నెటిజన్లు వార్తపై స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..