గర్భిణికి సిజేరియన్‌ చేసిన వైద్యులు.. ఆ తర్వాత తెలిసింది ఆమెకు హెచ్‌ఐవి పాజిటివ్‌ అని.. ! ఆపరేషన్‌ థియేటర్‌కు సీల్..

ఈ మేరకు..ఆసుపత్రి ఇన్‌ఛార్జ్ డా. యోగేష్ సింగారే తెలిపిన వివరాల ప్రకారం... నవంబర్ 4న గర్భిణికి శస్త్రచికిత్స జరిగింది. కానీ గురువారం, ఆ మహిళ తనకు గల HIV సంక్రమణ గురించి సమాచారం ఇచ్చింది. యువతికి చికిత్స చేసిన గైనకాలజిస్ట్ డా. సీమ సోనీని వివరణ కోరినట్టు యోగేష్ సింఘారే తెలిపారు. ఇదిలా ఉండగా, సీమా సోనీ తనకు ఆ విషయం తెలియదని వివరిస్తూ.. తనకు హెచ్‌ఐవీ పాజిటివ్ అని మహిళ కానీ, ఆమె భర్త కానీ తనకు చెప్పలేదని అన్నారు.

గర్భిణికి సిజేరియన్‌ చేసిన వైద్యులు.. ఆ తర్వాత తెలిసింది ఆమెకు హెచ్‌ఐవి పాజిటివ్‌ అని.. ! ఆపరేషన్‌ థియేటర్‌కు సీల్..
Surgery
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 11, 2023 | 12:22 PM

హెచ్‌ఐవి-పాజిటివ్ ఉన్న మహిళ తన ఇన్‌ఫెక్షన్ గురించి వైద్య సిబ్బందికి చెప్పకుండా సి-సెక్షన్ డెలివరీ చేయించుకుంది. అయితే, విషయం ఆలస్యంగా తెలియటంతో సదరు ఆస్పత్రిలో పెను దుమారం లేచింది.. డాక్టర్లు, వైద్య సిబ్బంది సర్జికల్ OT సీలు చేశారు. ఆపరేషన్ థియేటర్‌కు తాళం వేసి డాక్టర్‌తోపాటు సిబ్బంది ఆందోళనకు దిగారు. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. అధికారుల వద్ద బాధిత మహిళ తన హెచ్ ఐవి ఇన్‌ఫెక్షన్‌ను దాచిపెట్టడం ద్వారా సి-సెక్షన్ డెలివరీ జరిగింది. ఈ విషయాన్ని మహిళ గురువారం వెల్లడించడంతో ప్రభుత్వాసుపత్రిలోని సర్జికల్‌ ఆపరేషన్‌ థియేటర్‌ను మూసివేసి సీల్‌ వేశారు. సర్జరీలో పాల్గొన్న వైద్యులు సహా సిబ్బంది ఆందోళన చెందుతున్నారని సమాచారం.

ఈ మేరకు..ఆసుపత్రి ఇన్‌ఛార్జ్ డా. యోగేష్ సింగారే తెలిపిన వివరాల ప్రకారం… నవంబర్ 4న గర్భిణికి శస్త్రచికిత్స జరిగింది. కానీ గురువారం, ఆ మహిళ తనకు గల HIV సంక్రమణ గురించి సమాచారం ఇచ్చింది. యువతికి చికిత్స చేసిన గైనకాలజిస్ట్ డా. సీమ సోనీని వివరణ కోరినట్టు యోగేష్ సింఘారే తెలిపారు.

ఇదిలా ఉండగా, సీమా సోనీ తనకు ఆ విషయం తెలియదని వివరిస్తూ.. తనకు హెచ్‌ఐవీ పాజిటివ్ అని మహిళ కానీ, ఆమె భర్త కానీ తనకు చెప్పలేదని అన్నారు.. నేను ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది వద్ద ఎందుకు దాచిపెడతానంటూ వాపోయారు. పైగా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఇలాంటి పని ఎందుకు చేస్తానంటూ డాక్టర్‌ సోనీ వివరించారు.

ఇవి కూడా చదవండి

అయితే,సి-సెక్షన్ సర్జరీలో ఒక డాక్టర్‌తో పాటు నలుగురు నర్సులు కూడా పాల్గొన్నారు. OT హెడ్ టెక్నీషియన్ అశోక్ కాక్డే, వీరి బృందంలోని ఒక నర్సు తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారని చెప్పారు. ఇది ఒక పీడకలలా అనిపిస్తుంది. మమ్మల్ని, మా కుటుంబాలను కాపాడాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని కక్డే చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!