Chandra Mohan: తెలుగు సినిమాల్లో తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్.. చంద్రమోహన్
క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమైన చంద్రమోహన్... తెలుగు చిత్రసీమపై చెరగని ముద్ర వేశారు. దాదాపు వెయ్యి సినిమాల్లో కనిపించారు. ఆయన నటించిన కుటుంబ కథా చిత్రాలు.. పెద్దపెద్ద కమర్షియల్ సినిమాలక్కూడా పోటీనిచ్చేవి. చంద్రమోహన్.... దాదాపు ప్రతీ టాప్ హీరోయిన్‌తోనూ నటించారు. చంద్రమోహన్ కథానాయకుడిగా చేసిన సినిమాల్లో నటించి తెరంగేట్రం చేసిన నటులు అనేకమంది.
స్టార్ హీరో కాకపోయినా… హీరోకి కావల్సిన అన్ని గుణాల్నీ పుణికిపుచ్చుకున్న నటుడు చంద్రమోహన్. ఫ్యామిలీ సినిమాలకు పర్‌ఫెక్ట్ కేరాఫ్ అనిపించుకున్న చంద్రమోహన్… ఇక లేరు అన్నది తెలుగు సినిమా తీర్చుకోలేని లోటు. టాలీవుడ్ పరిశ్రమతో పాటు.. మిగతా ప్రముఖులు సైతం చంద్రమోహన్ మృతికి సంతాపం తెలిపాయి. చంద్రమోహన్ కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. చంద్రమోహన్ స్ఫూర్తితో ఎందరో నటీనటులు.. ఉన్నతస్థాయికి ఎదిగారని చెప్పారు..సీఎం కేసీఆర్. తెలుగుతో పాటు పలుభాషల్లో నటించి లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారని.. చంద్రమోహన్ మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటని చెప్పారు కేసీఆర్.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమైన చంద్రమోహన్… తెలుగు చిత్రసీమపై చెరగని ముద్ర వేశారు. దాదాపు వెయ్యి సినిమాల్లో కనిపించారు. ఆయన నటించిన కుటుంబ కథా చిత్రాలు.. పెద్దపెద్ద కమర్షియల్ సినిమాలక్కూడా పోటీనిచ్చేవి. చంద్రమోహన్…. దాదాపు ప్రతీ టాప్ హీరోయిన్‌తోనూ నటించారు. చంద్రమోహన్ కథానాయకుడిగా చేసిన సినిమాల్లో నటించి తెరంగేట్రం చేసిన నటులు అనేకమంది. ఆయన సినిమాల్లో ఆయనే హీరో, ఆయనే కమెడియన్. అప్పట్లోనే ఫ్యామిలీ హీరోగా, స్టార్ కమెడియన్‌గా డబుల్ షేడ్స్‌తో పాపులారిటీ తెచ్చుకున్నారు.
సహజ నటనతో, సింపుల్ పెర్ఫామెన్స్‌తో ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్విస్తారు, కంటతడి పెట్టిస్తారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకుడికి ఆరాధ్యుడయ్యారు. ఇటీవలి సినిమాల్లో తాను చేసిన క్యారెక్టర్లతో పక్కింటి అంకుల్‌గా నిన్నటిదాకా యూత్ ఆడియన్స్‌కి దగ్గరగానే ఉన్నారు చంద్రమోహన్.
1966లో రంగులరాట్నంతో తెరంగేట్రం చేశారు చంద్రమోహన్. సిరిసిరిమువ్వలో జయప్రదకు లక్కీ హ్యాండ్ అయ్యారు.. పదహారేళ్ల వయసు సినిమాలో శ్రీదేవితో నటించాక.. ఆయన పెర్ఫామెన్స్ లెవల్స్ ఏంటో ఆడియన్స్‌కు సంపూర్ణంగా తెలిసొచ్చింది. శ్రీదేవి, మంజుల, రాధిక, జయసుధ, జయప్రద, విజయశాంతి.. ఇలా చంద్రమోహన్‌తో సినిమాలు చేశాకే వీళ్లందరికీ స్టార్‌డమ్ పెరిగింది.
సుఖదుఃఖాలు, సీతామహాలక్ష్మి లాంటి సూపర్‌హిట్స్‌కి చంద్రమోహన్ నటనాకౌశలమే బేస్. ఇంకొక అడుగు పొడవు ఉంటే.. స్టార్ హీరో అయ్యేవారని, కమర్షియల్ హీరోలకు పోటీ అయ్యేవారని చెప్పుకునేవారు. బ్లాక్‌బస్టర్లు కొడుతున్న క్రిష్ణ, ఫిమేల్ ఆడియన్స్‌కి ఫేవరిట్ అయిన శోభన్‌బాబు కెరీర్‌లను సైతం.. చంద్రమోహన్‌కి వస్తున్న పాపులారిటీ ఇబ్బంది పెట్టింది.ఆయన చరిష్మా ఏ రేంజ్‌కి పెరిగిందంటే.. చంద్రమోహన్ ఎన్టీయార్ కాంపౌండా, ఏఎన్నార్ కాంపౌండా.. అనే చర్చ టాలీవుడ్ సర్కిల్స్‌లో ఘనంగా జరిగేవి. కానీ.. ఆయన మాత్రం అక్కినేని కాంపౌండేనన్న క్లారిటీ గట్టిగా ఉండేవి. అటు.. క్రిష్ణ, విజయనిర్మలతో సఖ్యంగా ఉంటారు చంద్రమోహన్. ఆయన మేనల్లుడు శివలెంక క్రిష్ణ ప్రసాద్.. శ్రీదేవి మూవీస్ బేనర్ ద్వారా నిర్మాతగా కొనసాగుతున్నారు.
గంగ-మంగ లాంటి మరికొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు వేసి నెగిటివ్ షేడ్స్‌లో కనిపించినా.. ఫ్యామిలీ ఆడియన్స్‌లో చంద్రమోహన్‌కి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. గులాబీ సినిమాలో తండ్రి పాత్ర పోషించి… మరింత పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఫాదర్ క్యారెక్టర్లకు చంద్రమోహనే కేరాఫ్ అయ్యారు. నువ్వునాకు నచ్చావ్, 7జీ బృందావన్ కాలనీ సినిమాలు ఆయన నటనలోని సీనియారిటీకి మరింత ఎలివేషన్ ఇచ్చాయి. శోక రసాన్ని, హాస్య రసాన్ని, కరుణ రసాన్ని సమపాళ్లలో పండిస్తూ.. కుటుంబకథాచిత్రాలకు ఆయువుపట్టుగా నిలిచారు చంద్రమోహన్.
అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు.. సినిమా పేరు చంద్రమోహన్. మల్లంపల్లి వీరభద్రశాస్త్రి- శాంభవి దంపతుల సంతానం. కళాతపస్వి కె. విశ్వనాథ్‌కి దగ్గరి బంధువు. సినిమాల్లో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు వెళ్లి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక బ్రాండ్‌గా మారారు చంద్రమోహన్. తొలి సినిమాకే బంగారు నంది గెల్చుకున్న అరుదైన కెరీర్ ఆయనది.
గోపీచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజన్.. చంద్రమోహన్‌కి ఆఖరి సినిమా. గోపీచంద్‌కి ఆరు సినిమాల్లో తండ్రిగా చేశారాయన. చంద్రమోహన్-సుధలది సూపర్‌హిట్ కాంబినేషన్. తెరపై అమ్మానాన్నల క్యారెక్టర్లలో వీళ్లిద్దరినీ చూడ్డానికి అలవాటు పడిపోయాడు తెలుగు ప్రేక్షకుడు. కానీ.. వెయ్యిదాకా సినిమాలు చేసినా.. సిరిసిరిమువ్వ, శుభోదయం, సీతామహాలక్ష్మి, పదహారేళ్ల వయసు సినిమాల్ని మరవలేనని చెబుతారు చంద్రమోహన్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..