అమ్మ నీకు చేతులెత్తి మొక్కాల్సిందే.. బాల భీముడిని కడుపున మోసిన తల్లి.. పుట్టగానే రికార్డ్ బ్రేక్ చేసిన శిశువు

పాప రావడంతో తల్లిదండ్రుల బంధువులే కాకుండా వైద్యబృందం కూడా చప్పట్లతో నవజాత శిశువుకు స్వాగతం పలికారు. అక్టోబర్ 31న సోనీ పుట్టవచ్చని వైద్యులు తల్లి బ్రిట్నీకి డెలివరీ డేట్‌ ఇచ్చారు. అయితే షెడ్యూల్ కంటే వారం రోజుల ముందే ఈ భారీ పాప పుట్టింది. వెయిటింగ్ స్కేల్‌పై ఉంచిన బిడ్డను చూసి అందరూ ఆశ్చర్యపోయారని చిన్నారి తండ్రి చెప్పారు. అధిక బరువుతో లడ్డూలా కనిపిస్తున్న చిన్నారిని చూసి ఆస్పత్రి వైద్యులు, నర్సులు సంతోషం వ్యక్తం చేశారు.

అమ్మ నీకు చేతులెత్తి మొక్కాల్సిందే.. బాల భీముడిని కడుపున మోసిన తల్లి.. పుట్టగానే రికార్డ్ బ్రేక్ చేసిన శిశువు
Heaviest Weighing Baby
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 11, 2023 | 1:51 PM

నవజాత శిశువులు సాధారణంగా ఎంత బరువు ఉంటారు? గరిష్టంగా 3 నుంచి 4 కిలోలు. కానీ, కెనడాలో అప్పుడే పుట్టిన ఓ చిన్నారి 6.5 కిలోల బరువుతో రికార్డు సృష్టించింది. కెనడాలో ఒక మహిళ సిజేరియన్ ద్వారా 6.5 కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది. 13 సంవత్సరాలలో ఇంత బరువున్న శిశువు జన్మించడం ఇదే మొదటిసారి. కెనడియన్ జంట బ్రిట్నీ ఐరీ, ఛాన్స్ ఐరీలు తమ 5వ బిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డ బరువు కారణంగా బాలభీముడే తమ ఇంటికి వచ్చాడని ఆ తల్లిదండ్రులు సంబరపడుతున్నారు. చిన్నారి రాకతో వారంతా ఆనందంలో మునిగితేలుతున్నారు. చిన్నారికి సోనీ ఎయిరీ అని పేరు పెట్టారు.

సోని ఐరి సాధారణ పిల్లల కంటే రెట్టింపు బరువు పెరగడం, లడ్డూలా కనిపిస్తున్న చిన్నారిని చూసి ఆస్పత్రి వైద్యులు, నర్సులు సంతోషం వ్యక్తం చేశారు. పౌండ్ల పరంగా, శిశువు బరువు 14 పౌండ్ల 8 ఔన్సులు (సుమారుగా 6 కిలోల 500 గ్రా). సోనీ ఐరెస్ అక్టోబర్ 23న కేంబ్రిడ్జ్‌లోని మెమోరియల్ హాస్పిటల్‌లో జన్మించింది. సోనీ తల్లి బ్రిట్నీకి సిజేరియన్ ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. పాప రావడంతో తల్లిదండ్రుల బంధువులే కాకుండా వైద్యబృందం కూడా చప్పట్లతో నవజాత శిశువుకు స్వాగతం పలికారు. అక్టోబర్ 31న సోనీ పుట్టవచ్చని వైద్యులు తల్లి బ్రిట్నీకి డెలివరీ డేట్‌ ఇచ్చారు. అయితే షెడ్యూల్ కంటే వారం రోజుల ముందే ఈ భారీ పాప పుట్టింది. వెయిటింగ్ స్కేల్‌పై ఉంచిన బిడ్డను చూసి అందరూ ఆశ్చర్యపోయారని చిన్నారి తండ్రి చెప్పారు.

పాప జన్మించిన కేంబ్రిడ్జ్ ఆసుపత్రికి కూడా ఇది రికార్డు. ఇంతకు ముందు, ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. ఛాన్స్ జూనియర్, ఎవెరిటీ, లక్కీ వారి పెద్ద సోదరి మేరిగోల్డ్, వీరిలో మేరిగోల్డ్ పుట్టినప్పుడు 13 పౌండ్లు, 14 ఔన్సుల బరువు కలిగి ఉన్నారు. దీని తరువాత లక్కీ బరువు 13 పౌండ్ల 11 ఔన్సులు. అందువల్ల, వారి కుటుంబంలో జన్మించిన భారీ శరీర బరువు కలిగిన పిల్లల కేసు ఇదేం కొత్తది కాదు. కానీ, ఈ సోనీ 14 పౌండ్ల బరువుతో వారందరి బరువు రికార్డును బద్దలు కొట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..