black raisins: నల్ల ఎండు ద్రాక్షతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఇలా తింటే రెట్టింపు లాభాలు..!

చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. దీంతో ముఖంపై మొటిమలు రాకుండా నివారిస్తుంది. ఇది చర్మ రంధ్రాల లోపల టాక్సిన్స్, కాలుష్య కారకాలు, ధూళి, మలినాలు పేరుకుపోకుండా చూస్తోంది. నల్ల ఎండుద్రాక్షలో ఉండే డైటరీ ఫైబర్స్ మన శరీరాలను టాక్సిన్స్, కాలుష్య కారకాలు, ఇతర మలినాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి. నల్ల ఎండు ద్రాక్షలో ఐరన్, విటమిన్ బి-కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఐరన్ ఎర్ర రక్త కణాలను వృద్ది చేయటానికి సహయపడుతుంది.

black raisins: నల్ల ఎండు ద్రాక్షతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఇలా తింటే రెట్టింపు లాభాలు..!
Dry Grape
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 12, 2023 | 9:38 AM

ద్రాక్షలో పలు రకాలు ఉంటాయి. కానీ, ఎండు ద్రాక్ష తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు, పాలీఫెనాల్స్ , డైటరీ ఫైబర్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎండుద్రాక్షలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా నల్ల ద్రాక్షలు తినడం వల్ల ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఎండుద్రాక్ష జీర్ణక్రియకు, మలబద్ధకాన్ని నివారించడానికి ఉత్తమమైనది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. వీటిని నీటిలో నానబెట్టి తింటే వాటి ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. దీని కోసం మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండుద్రాక్షను తినవచ్చు.

ఎండుద్రాక్ష జీర్ణక్రియకు మరియు మలబద్ధకాన్ని నివారించడానికి ఉత్తమమైనది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీని కోసం మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండుద్రాక్షను తినవచ్చు. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, కంటి ఆరోగ్యానికి ఇవి మంచివి. అదేవిధంగా, మీరు రక్తహీనతను నివారించడానికి మరియు ఎముకల ఆరోగ్యానికి నానబెట్టిన ఎండుద్రాక్షను తింటే మంచిది. ఎండు ద్రాక్ష తినడం వల్ల దంతాల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. క్యాల్షియం పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష పంటి ఎనామిల్‌ను కాపాడుతుంది. నల్ల ఎండు ద్రాక్షలో ఐరన్, విటమిన్ బి-కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఐరన్ ఎర్ర రక్త కణాలను వృద్ది చేయటానికి సహయపడుతుంది.

కొన్ని అధ్యయనాలు ఎండిన ద్రాక్షను తీసుకోవడం వల్ల అనేక రకాల క్యాన్సర్లను నివారించవచ్చని కూడా సూచిస్తున్నాయి. శరీరానికి అవసరమైన శక్తిని పెంచడానికి అవసరమైన ఖనిజాలను కలిగి ఉంటాయి. కొలెస్ట్రాల్ లేకుండా బరువు పెరగాలనుకునే వారు రోజూ ఎండు ద్రాక్షను ఎక్కువగా తినవచ్చు. నానబెట్టిన నల్ల ఎండుద్రాక్ష తినడం చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. దీంతో ముఖంపై మొటిమలు రాకుండా నివారిస్తుంది. ఇది చర్మ రంధ్రాల లోపల టాక్సిన్స్, కాలుష్య కారకాలు, ధూళి, మలినాలు పేరుకుపోకుండా చూస్తోంది. నల్ల ఎండుద్రాక్షలో ఉండే డైటరీ ఫైబర్స్ మన శరీరాలను టాక్సిన్స్, కాలుష్య కారకాలు, ఇతర మలినాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

ఉదయాన్నే నానబెట్టిన ఎండుద్రాక్షను తినడం వలన దృష్టి మెరుగవుతుంది. కంటి పొడిబారడాన్ని నివారిస్తుంది. రే చీకటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది జుట్టు మూలాలు, చర్మం బలంగా మారడంలో ప్రయోజనం చేకూరుస్తుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..