AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: మారిన పాలమూరు ముఖచిత్రం.. ఒకే పార్టీలోని నేతలే, ఎన్నికల రణరంగంలో ప్రత్యర్థులు..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పాలమూరు పాలిటిక్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల రణరంగంలో పోటీ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఇన్ని రోజులు ఒకే ఒరలో ఉన్న రెండు కత్తులు.. ఇప్పుడు ఒకదానికొకటి దుసుకుంటున్నాయి..! నాడు ఒకే పార్టీలో ఉన్న మిత్రులే, నేడు ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా బరిలోకి తలపడుతున్నారు.

Telangana Election: మారిన పాలమూరు ముఖచిత్రం.. ఒకే పార్టీలోని నేతలే, ఎన్నికల రణరంగంలో ప్రత్యర్థులు..!
Mahabubnagar
M Sivakumar
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 12, 2023 | 10:43 AM

Share

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పాలమూరు పాలిటిక్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల రణరంగంలో పోటీ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఇన్ని రోజులు ఒకే ఒరలో ఉన్న రెండు కత్తులు.. ఇప్పుడు ఒకదానికొకటి దుసుకుంటున్నాయి..! నాడు ఒకే పార్టీలో ఉన్న మిత్రులే, నేడు ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా బరిలోకి తలపడుతున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ రాజకీయాలు ఎప్పుడు ఎవరికి అర్థం కావు. ఇక ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు అయితే, కొంత మంది నేతలకు కీలకంగా మారాయి. ఆశించిన పార్టీలో టికెట్ దక్కకపోవడంతో ఏకంగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇప్పుడు హోరా హోరీగా ప్రచారం నిర్వహిస్తూ హీట్ పుట్టిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ప్రచారంతో హోరెత్తిస్తునే, ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు.

నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో దాదాపుగా 5 స్థానాల కాంగ్రెస్ అభ్యర్ధులు, మొన్నటివరకు బీఆర్ఎస్ నేతలే కావడం విశేషం. నాగర్ కర్నూల్, గద్వాల్, వనపర్తి, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ఈసారి ఎన్నికల బరి కాస్త డిఫెరెంట్ గా కనిపిస్తోంది. ఈ ఐదు నియోజకవర్గాల్లో నేతలకు అధికార పార్టీ బీఆర్ఎస్‌లో టికెట్ దక్కకపోవడంతో, పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే బీఆర్ఎస్ అధినేత అభ్యర్థులను ఖరారు చేయడం,తో నేతలకు దారులు సులభం అయ్యాయి. దాదాపుగా టికెట్ హామీతోనే నేతలందరూ పార్టీ మారారు. అదే స్థాయిలో టికెట్ సంపాదించి ఇప్పుడు బరిలో నిలిచారు.

గద్వాల్‌ నియోజకవర్గం విషయానికి వస్తే, సరిత తిరుపతయ్య జెడ్పీ ఛైర్పర్సన్ గా ఉన్నారు. టికెట్ దక్కదని తెలిసి అందరికంటే ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీసీ సమీకరణలో హస్తం పార్టీ నుంచి టికెట్ తెచ్చుకోగలిగారు. ఇక, వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సైతం బీఆర్ఎస్ నేత కావడం విశేషం. మంత్రి నిరంజన్ రెడ్డితో విభేదాల కారణంగా పార్టీని వీడి ఎన్నికల బరిలో ప్రత్యర్థి పార్టీ తరఫును నిలిచారు. కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి సైతం మొన్నటి వరకు బీఆర్ఎస్ నేతగానే ఉన్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన కాంగ్రెస్‌లో చేరి హస్తం అభ్యర్థిత్వం పొందారు.

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నుంచి కొల్లాపూర్ టికెట్ ఆశించారు. గత ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ సైతం చేసి ఓడిపోయారు. అదే స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో చేరడం, తిరిగి ఆయనకే కారు పార్టీ బీ ఫాం ప్రకటించడంతో జూపల్లి హస్తం పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా బరిలో నిలిచారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోనూ సిట్టింగ్ కే సీటు దక్కడంతో, నాటి బీఆర్ఎస్ నేత కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. ఏకంగా సీనియర్ నాగం జనార్థన్ రెడ్డిని కాదని టికెట్ సైతం సంపాదించి, తొలిసారి అసెంబ్లీ ఎన్నికల పరీక్షకు సిద్ధమయ్యారు.

నిన్న, మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్న నేతలే ఎన్నికల రణరంగంలో ఒకరికొకరు ప్రత్యర్థులుగా నిలిచారు. పార్టీలు వేరైనా అందరి లక్ష్యం అసెంబ్లీలో అడుగుపెట్టడమే. ప్రజల తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…