కాంగ్రెస్ లో చేరికపై స్పష్టతనిచ్చిన ధర్మపురి శ్రీనివాస్… పార్టీలో చేరినట్లు భావిస్తే రాజీనామాగా ఆమోదించాలంటూ లేఖ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ మాజీ అధ్యక్షుడు, BRS రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్‌ మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు వార్తలొచ్చాయి. రాష్ట్ర ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే సమక్షంలో DSకు సీనియర్‌ నేతలు వీహెచ్, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ కండువాలు కప్పి ఆహ్వానించినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.

కాంగ్రెస్ లో చేరికపై స్పష్టతనిచ్చిన ధర్మపురి శ్రీనివాస్... పార్టీలో చేరినట్లు భావిస్తే రాజీనామాగా ఆమోదించాలంటూ లేఖ
D Srinivas
Follow us

|

Updated on: Mar 27, 2023 | 5:26 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ మాజీ అధ్యక్షుడు, BRS రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్‌ మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు వార్తలొచ్చాయి. రాష్ట్ర ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే సమక్షంలో DSకు సీనియర్‌ నేతలు వీహెచ్, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ కండువాలు కప్పి ఆహ్వానించినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై స్పష్టతనిస్తూ ధర్మపురి శ్రీనివాస్.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రాశారు. ఈ నెల 26వ తేదిన తన కుమారుడు డి. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆశీస్సులు అందజేయడానికి గాంధీభవన్ కు వెళ్లగా తనకు కండువాలు కప్పడంతో మళ్లీ పార్టీలో చేరినట్లు మీడియాలో ప్రచారం వచ్చిందని తెలిపారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్ వాదినే కానీ ప్రస్తుతం వయస్సు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రియాశిల రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నానని పేర్కొన్నారు. పార్టీలో తన చేరికకు తన కుమారుడు డి. సంజయ్ టికెట్ కు ముడిపెట్టడం భావ్యం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు, సంప్రదాయాలు, ప్రజల ఆమోదం మేరకే పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతుందని గుర్తుచేశారు. ఆరోగ్యరిత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న తనను వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీలో తాను మళ్లీ చేరానని భావిస్తే ఈ లేఖను రాజీనామాగా భావించి, ఆమోదించవలసిందిగా కోరుతున్నానని తెలిపారు.

మరోవైపు ధర్మపురి శ్రీనివాస్ భార్య విజయలక్ష్మీ కూడా ఇగో డీస్ రాజీనామా అంటూ ఓ లేఖ రాశారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని..మీరు ఆయన్ని పార్టీలో చేర్చుకునే పద్దతి ఇది కాదని తెలిపారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పక్షవాతం కూడా వచ్చిందని దయచేసి ఆయనను రాజకీయాలకు వాడుకోవద్దని వేడుకుంది. కాంగ్రెస్ నేతలు పెట్టిన ఇబ్బందులకు ఆయనుకు రాత్రి ఫిట్స్ కూడా వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లకు చేతులు జోడించి చెబుతున్న.. ఇంకోసారి ఇటువైపు రాకండని, ఈ వయసులో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ని ప్రశాంతంగా బతకనివ్వండి అంటూ లేఖను ముగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.