Hyderabad: ఇకపై రాంగ్ రూట్‌లో వెళ్లేవారికి దబిడి దిబిడే.. సైబరాబాద్ పోలీసుల సంచలన నిర్ణయం!
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రహితంగా మార్చేందుకు హైదరాబాద్ పోలీసులు కంకణం కట్టుకున్నారు. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. అయితే రాంగ్ రూట్‌లో వాహనదారులు ప్రయాణించడం వల్ల ఎక్కవ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసుల నివేదికల్లో తేలింది. దీంతో రాంగ్ రూట్‌లో ప్రయాణించేవారిపై కొరడా ఝులిపించాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు.

హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రహితంగా మార్చేందుకు హైదరాబాద్ పోలీసులు కంకణం కట్టుకున్నారు. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. అయితే రాంగ్ రూట్‌లో వాహనదారులు ప్రయాణించడం వల్ల ఎక్కవ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసుల నివేదికల్లో తేలింది. దీంతో రాంగ్ రూట్‌లో ప్రయాణించేవారిపై కొరడా ఝులిపించాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఇప్పటివరకు ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించేవారి ఫోటోలు తీసేవారు. లేదంటే జంక్షన్లలోని కెమెరాలు ద్వారా వారిని పసిగట్టేవారు. ఇకపై సరికొత్త ఆయుధాన్ని ప్రయోగించబోతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.
రాంగ్ రూట్ డ్రైవింగ్ నివారణ కోసం తాజాగా సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా వాహనదారులు రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తుంటే.. వారి ఫోటోలు తీసే అధికారాన్ని సాధారణ ప్రజలకు కల్పించారు. నిబంధన అతిక్రమించి, రాంగ్ రూట్‌లో వెళ్లేవారి ఫోటో తీసి తమకు పంపిస్తే.. సదరు వాహనదారులకు ఫైన్ విధిస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ పెట్టారు. రాంగ్ రూట్‌లో వెళ్లేవారి ఫోటోలు, వీడియోలను తమ వాట్సాప్ నెంబర్ 94906-17346కు పంపించాలని సూచించారు. వాటితోపాటు టైం, డేట్, లొకేషన్ వంటి వివరాలను పంపించాలని కోరారు. ఇది మంచి పని అని పోలీసులను సామాన్యులు ప్రశంసిస్తున్నారు. ఈ నిర్ణయం రాష్ట్రమంతటా వర్తించేలా చూడాలని మరికొందరు కోరుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. రాంగ్ రూట్‌లో వెళ్లేవారి భరతం పట్టండి.. ప్రజల ప్రాణాల్ని కాపాడండి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
