Electricity Bill: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు.. యూనిట్‌కు ఎంత పెరిగిందంటే..?

Electric Charges in Telangana: తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిస్కంల వినతి మేరకు కరెంటు ఛార్జీలను పెంచుతూ కేసీఆర్

Electricity Bill: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు.. యూనిట్‌కు ఎంత పెరిగిందంటే..?
Electricity Bill

Updated on: Mar 23, 2022 | 4:15 PM

Electric Charges in Telangana: తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిస్కంల వినతి మేరకు కరెంటు ఛార్జీలను పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 14 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ఈఆర్సీ ఉత్తర్వలు జారీ చేసింది. డొమెస్టిక్ మీటర్లపై యూనిట్ కు 40 నుంచి 50 పైసల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే ఇతర కేటగిరీలపై యూనిట్ కు రూపాయి చొప్పున పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాగా.. రాష్ట్రంలో 19 శాతం మేర విద్యుత్ ఛార్జీల పెంపునకు అనుమతి కోరగా.. 14 శాతం మాత్రమే విద్యుత్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ఈఆర్ఎసీ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా.. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ సీఎం కేసీఆర్ చార్జీల పెంపు కే మొగ్గు చూపితే రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటి నుంచి కరెంటు ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

Also Read:

Viral Video: రాక్షసానందం అంటే ఇదే..! మూగజీవిని హింసిస్తూ ఆటలాడాడు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..

NFDC India Jobs: రూ. లక్షకుపైగా జీతంతో.. నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..

Follow Us