NFDC India Jobs: రూ. లక్షకుపైగా జీతంతో.. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబాయిలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NFDC).. ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల (Manager Posts)భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
NFDC India Manager Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబాయిలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NFDC).. ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల (Manager Posts)భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 9
పోస్టుల వివరాలు:
- మేనేజర్ పోస్టులు: 5
విభాగాలు: మార్కెటింగ్ అండ్ అడ్మినస్ట్రేషన్, సోషల్ మీడియా అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్, ఫెస్టివల్ ప్రోగ్రామింగ్, ఫిల్మ్ ప్రిజర్వేషన్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
- డిప్యూటీ మేనేజర్ పోస్టులు: 4
విభాగాలు: ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఫిల్మ్ ప్రొడక్షన్, ఫిల్మ్ ప్రిజర్వేషన్ అండ్ మార్కెటింగ్, ఐటీ.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లొమా, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
పే స్కేల్: నెలకు రూ.85,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అడ్రస్: జనరల్ మేనేజర్, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, నెహ్రూ సెంటర్, వర్లీ, ముంబాయి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 10, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: