Watch: అర్ధరాత్రి బాత్రూం వైపు నుంచి అరుపులు.. ఏంటా అని చూడగా గుండె ఆగినంత పనైంది.. షాకింగ్ వీడియో
రాత్రయింది.. యథావిధిగా అంతా భోజనాలు చేసి నిద్రపోయారు.. అర్ధరాత్రి అయింది.. ఏదో సౌండ్ వస్తోంది.. పైగా కుక్కలన్నీ అరుస్తున్నాయి.. దీంతో ఏంటోనని.. ఆ వ్యక్తి నిద్ర నుంచి అకస్మాత్తుగా లేచి వచ్చి చూశాడు.. దెబ్బకు గుండె ఆగేంత పనైంది.. ఓ భారీ మొసలి అర్ధరాత్రి ఇంటి ముందు కనిపించడంతో ముచ్చెమటలు పట్టాయి.. దీంతో వెంటనే వెళ్లి తలుపువేసుకున్నాడు.
రాత్రయింది.. యథావిధిగా అంతా భోజనాలు చేసి నిద్రపోయారు.. అర్ధరాత్రి అయింది.. ఏదో సౌండ్ వస్తోంది.. పైగా కుక్కలన్నీ అరుస్తున్నాయి.. దీంతో ఏంటోనని.. ఆ వ్యక్తి నిద్ర నుంచి అకస్మాత్తుగా లేచి వచ్చి చూశాడు.. దెబ్బకు గుండె ఆగేంత పనైంది.. ఓ భారీ మొసలి అర్ధరాత్రి ఇంటి ముందు కనిపించడంతో ముచ్చెమటలు పట్టాయి.. దీంతో వెంటనే వెళ్లి తలుపువేసుకున్నాడు.. ఈ షాకింగ్ ఘటన వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం జానంపేటలో చోటుచేసుకుంది.. సోమవారం అర్ధరాత్రి గ్రామ సమీపంలోని రామసముద్రం చెరువు నుంచి భారీ మొసలి బయటకు వచ్చింది.. దాన్ని చూసిన వీధి కుక్కలు మొసలి వెంట పడ్డాయి.. ఈ క్రమంలో సమీపంలో ఉన్న నాగన్న ఇంట్లోకి మొసలి చొరబడింది. అది వచ్చి మరుగుదొడ్డి పక్కన తిష్టవేసింది..
కుక్కల అరుపులతో బయటకు వచ్చి చూసిన నాగన్న మొసలి చూసి.. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు.. వారు అక్కడికి చేరుకుని మొసలిని తాళ్లతో బంధించి రంగాపురం వద్ద కృష్ణా నదిలో వదిలేశారు.
వీడియో చూడండి..
ఈ మొసలి 8 అడుగుల పొడవు.. 90 కిలోల బరువు ఉన్నట్లు అటవీ అధికారులు తెలిపారు. అది సమీపంలోని చెరువు నుంచి పొలాల ద్వారా దారి తప్పి వచ్చి ఉంటుందని వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..