AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: 35 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ..! రూట్ క్లియర్ అయిన నేతలెవరు..?

తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతూ.. ప్రణాళికలను రచిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక దఫాలుగా చర్చలు జరిపిన స్క్రీనింగ్ కమిటీ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో అభ్యర్థుల వడపోతపై దృష్టి సారించింది.

Telangana Congress: 35 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ..! రూట్ క్లియర్ అయిన నేతలెవరు..?
Telangana Congress
TV9 Telugu
| Edited By: |

Updated on: Sep 21, 2023 | 2:06 PM

Share

తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతూ.. ప్రణాళికలను రచిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక దఫాలుగా చర్చలు జరిపిన స్క్రీనింగ్ కమిటీ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో అభ్యర్థుల వడపోతపై దృష్టి సారించింది. ఏఐసీసీ కార్యాలయంలో నిన్న సమావేశమైన కమిటీ.. ఈరోజు, రేపు సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. కమిటీ సమావేశంలో ఛైర్మన్ మురళీధరన్, సభ్యులు జిగ్నేష్ మేవానీ, సిద్ధిఖీ, ఎక్స్ అఫిషియో సభ్యులుగా రాష్ట్ర ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. తాజాగా, అధిష్టానం స్క్రీనింగ్ కమిటీలోకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కి గౌడ్ లకు కూడా అవకాశమిచ్చింది.

అయితే, అభ్యర్థుల వడపోతలో దృష్టి సారించిన స్క్రీనింగ్ కమిటీ.. ఈనెల ఆరో తారీఖున హైదరాబాదులో సమావేశమైంది. అప్పటికే పీఈసీ సభ్యులను, డీసీసీ అధ్యక్షులను, మాజీ మంత్రుల అభిప్రాయాలు తీసుకుంది స్క్రీనింగ్ కమిటీ.. అయితే జిల్లా అధ్యక్షుల ఇచ్చిన సమాచారం కుదించడంలో సమయం సరిపోక మరోసారి భేటీ అవ్వాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇప్పుడు హస్తినలో స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. ఏకాభిప్రాయం కుదిరితే 25 నుంచి 30 సీట్లలో అభ్యర్థుల ఖరారు చేయాలనే ఆలోచనలో ఉంది పార్టీ.. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు అభ్యర్థులున్న చోట మరోసారి స్క్రీనింగ్ కమిటీ దృష్టి పెట్టాలని భావిస్తోంది. ఈ నెలాఖరుకల్లా అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తిచేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తుందని తెలుస్తోంది. మొత్తంగా 119 స్థానాలకు.. 35 స్థానాల్లో అభ్యర్థుల లిస్టు క్లియర్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాలో 35 నియోజకవర్గాలు ఉంటాయని సమాచారం.. ఆయా నియోజకవర్గాలు ఇవేనంటూ ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాను వారం రోజుల్లో రిలీజ్ చేసే అవకాశముందని పేర్కొంటున్నారు. అయినప్పటికీ.. అభ్యర్థుల జాబితా గురించి కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

1. కొడంగల్ – రేవంత్ రెడ్డి

2. హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి

3. కోదాడ – పద్మావతి

4. మధిర – భట్టి విక్రమార్క

5. మంథని – శ్రీధర్ బాబు

6. జగిత్యాల – జీవన్ రెడ్డి

7. ములుగు – సీతక్క

8. భద్రాచలం – పొడెం వీరయ్య

9. సంగారెడ్డి – జగ్గారెడ్డి

10. నల్గొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి

11. అలంపూర్ – సంపత్ కుమార్

12. నాగార్జునసాగర్ – కుందూరు జైవీర్ రెడ్డి

14. కామారెడ్డి – షబ్బీర్ అలీ

15. మంచిర్యాల – ప్రేమ్ సాగర్ రావు

16. ఆందోల్ – దామోదర రాజనర్సింహ

17. పరిగి – రామ్మోహన్ రెడ్డి

18. వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్

19. ఇబ్రహీంపట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి

20. ఆలేరు – బీర్ల ఐలయ్య

21. బాల్కొండ – సునీల్ రెడ్డి

22. ఖమ్మం- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

23. నర్సంపేట – దొంతి మాధవరెడ్డి

24. పెద్దపల్లి- విజయ రమణరావు

25. చొప్పదండి- మేడిపల్లి సత్యం

26. నిర్మల్ – శ్రీ హరి రావు

27. భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ

28. బెల్లంపల్లి- గడ్డం వినోద్

29. నాంపల్లి – ఫిరోజ్ ఖాన్

30. వేములవాడ- అది శ్రీనివాస్

31. నర్సాపూర్- ఆవుల రాజీ రెడ్డి

32. జహీరాబాద్ – A చంద్రశేఖర్

33. ఆసిఫాబాద్ – రేఖ నాయక్/శ్యామ్ నాయక్

34. ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్

35. మహేశ్వరం- చిగురింత పారిజాత నర్సింహారెడ్డి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..