Telangana: కొల్లాపూర్ కాంగ్రెస్ సభలో ఎం జరగబోతుంది.. కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ అదేనా?
తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు మరింత దూకుడుగా వెళ్తుంది. ఖమ్మం సభ విజయవంతంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ ఆ ఊపు ను కొనసాగించాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. అంతే స్థాయిలో ఉమ్మడి మహబూబ్ నగర్‌లోని కొల్లాపూర్ వేదికగా భారీ బహిరంగ సభకి సిద్ధమవుతుంది.

- తెలంగాణ కాంగ్రెస్‌లో ఖమ్మం జోష్ కొనసాగేనా..?
- అంతే స్థాయిలో మరో భారీ బహిరంగ సభకి సిద్ధమవుతుందా..?
- కొల్లాపూర్ వేదికగా కాంగ్రెస్‌లో చేరేది ఎవరు..?
- ముఖ్య నేతలతో జూపల్లి సమావేశం వెనుక రహస్యం అదేనా..?
తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు మరింత దూకుడుగా వెళ్తుంది. ఖమ్మం సభ విజయవంతంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ ఆ ఊపు ను కొనసాగించాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. అంతే స్థాయిలో ఉమ్మడి మహబూబ్ నగర్‌లోని కొల్లాపూర్ వేదికగా భారీ బహిరంగ సభకి సిద్ధమవుతుంది. ఈ నెల 20 న ఈ సభ నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తో పాటు ఏఐసిసి పెద్దలు హాజరుకానున్నట్లు సమాచారం. దాదాపు లక్ష మందితో సభ నిర్వహించడానికి ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఇక కొల్లాపూర్ సభతో పాటు పార్టీలో చేరికల అంశంపై జూపల్లి కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లి భట్టి ని కలిసిన జూపల్లి.. సభకు రావాల్సిందిగా ఆహ్వానించారు. జూపల్లితో పాటు కాంగ్రెస్‌లో చేరనున్న వారి లిస్ట్ సైతం భట్టి కి ఇచ్చినట్లు సమాచారం. జూపల్లితో పాటు ఎమ్మెల్సీ కూచుకుంట్ల దామోదర్ రెడ్డి ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాద్ రెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ నేతలు సహా పలువురు కాంగ్రెస్‌లో చేరనున్నారు.
ఖమ్మం సభ నుండి ప్రతి 15 రోజులకో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది.. ఖమ్మం లో చేయూత ద్వారా 4 వేల పెన్షన్ అంతకు ముందు వరంగల్ లో రైతు డిక్లరేషన్, హైదరాబాద్ వేదికగా యూత్ డిక్లరేషన్ మాదిరి కొల్లాపూర్ సభలోనూ పలు పథకాలు ప్రకటించనున్నట్లు సమాచారం.. ఇప్పటికే కాంగ్రెస్ అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేస్తున్న 500 కే గ్యాస్, మహిళలకు ఉచిత ప్రయాణం, నగదు బదిలీ పథకం లాంటివి కొల్లాపూర్ వేదికగా ప్రకటించానున్నారు..




కొల్లాపూర్ సభ లో భారీ చేరికల్లో అధికార బీఆరెస్, బీజేపీ నుండి భారీ చేరికలుంటాయని నేతలు చెబుతుండడంతో ఆసక్తి నెలకొనడం తో ఎవరెవరు చేరుతారో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..