Jagga Reddy: సంగారెడ్డిలో హైడ్రా అడుగుపెడితే ఖబడ్దార్‌.. జగ్గారెడ్డి వార్నింగ్

హైడ్రా విషయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి కొన్ని సూచనలు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలను హైడ్రా పేరుతో భయభ్రాంతులకు గురి చేయవద్దని చెప్పారు. తన నియోజకవర్గంలో ఏలాంటి కూల్చివేతలు లేకుండా చూడలన్నారు.

Jagga Reddy: సంగారెడ్డిలో హైడ్రా అడుగుపెడితే ఖబడ్దార్‌.. జగ్గారెడ్డి వార్నింగ్
Jagga Reddy On Hydra
Follow us
P Shivteja

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 30, 2024 | 1:30 PM

హైడ్రా విషయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి కొన్ని సూచనలు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలను హైడ్రా పేరుతో భయభ్రాంతులకు గురి చేయవద్దని చెప్పారు. తన నియోజకవర్గంలో ఏలాంటి కూల్చివేతలు లేకుండా చూడలన్నారు. ఎందుకంటే సంగారెడ్డి నియోజకవర్గం ఔటర్ రింగ్ రోడ్డుకు బయట ఉంటుందని,అందుకే తన నియోజకవర్గంలో కూల్చివేతలు ఉండకూడదన్నారు. ఒకవేళ తన నియోజకవర్గంలో ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటే ముందుగా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. హైడ్రా అధికారులు అత్యుత్సాహం చూపించవద్దన్నారు.

ఈ విషయంపై తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడతానని జగ్గారెడ్డి చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలను భయాందోళనలకు గురి చేసే ప్రయత్నం చేయవద్ద అని ఆయన అధికారులకు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా ఔటర్ రింగ్ రోడ్డు లోపల మాత్రమే చర్యలు చేపడుతుందని ప్రకటించారని గుర్తు చేశారు. రింగ్ రోడ్డు బయట హైడ్రా యాక్షన్ ఉండదని సీఎం చెప్పినట్లు తెలిపారు. కానీ సంగారెడ్డి నియోజకవర్గంలో హైడ్రా పేరుతో కూల్చివేతలు ఉంటాయని ప్రచారం జరుగుతోందన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు అని ఆయన సూచించారు.

జగ్గారెడ్డి ఏమన్నారంటే..

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా జగ్గారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలే టీపీసీసీ ఛీప్‌గా మహేష్ కూమార్ గౌడ్‌ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించిన సంగతి తెలిసిందే. జగ్గారెడ్డికి కూడా కాంగ్రెస్ హైకమాండ్ కీలక పదవి ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు త్వరలో టీపీపీసీ క్యాంపెన్ కమిటీ ఛైర్మన్ పదవి ఇస్తారనే  ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్
మెల్‌బోర్న్‌‌లో విరాట్‌ కోహ్లి సెంచరీ పక్కా.. ఇదిగో గణాంకాలు
మెల్‌బోర్న్‌‌లో విరాట్‌ కోహ్లి సెంచరీ పక్కా.. ఇదిగో గణాంకాలు
బరాక్ ఒబామాకు నచ్చిన భారతీయ సినిమా ఇదే..
బరాక్ ఒబామాకు నచ్చిన భారతీయ సినిమా ఇదే..
నేడు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలేంటి?
నేడు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలేంటి?
ఆస్తి కోసం దాడి చేసి తల్లినే హతమార్చాడు..
ఆస్తి కోసం దాడి చేసి తల్లినే హతమార్చాడు..
మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి
మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి
ఒక్క సినిమాతో హీరోయిన్స్ కుళ్లుకునేలా చేసిన వయ్యారి..
ఒక్క సినిమాతో హీరోయిన్స్ కుళ్లుకునేలా చేసిన వయ్యారి..