21 December 2024
తమన్నా ఆస్తులు తెలిస్తే నోరెళ్లపెడతారు.. ఎన్ని కోట్లంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ తమన్నా. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ మిల్కీబ్యూటీ.
2005లో శ్రీ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఇప్పటికీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ దూసుకుపోతుంది.
ఈరోజు తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా మిల్కీ బ్యూటీకి సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతూ తమన్నా ఫోటోస్ షేర్ చేస్తున్నారు.
నివేదికల ప్రకారం తమన్నా ఆస్తులు రూ.120 కోట్లు. అంతేకాదు ఒక్కో సినిమాకు ఏకంగా 4-5 కోట్లు పారితోషికం తీసుకుంటుందట ఈ వయ్యారి.
సినిమాలే కాకుండా మొబైల్ ప్రీమియర్ లీగ్, ఫాంటా, సెల్కాన్ మొబైల్స్ వంటి అనేక బ్రాండ్స్ అంబాసిడర్. యాడ్స్ ద్వారా కూడా ఎక్కువగానే సంపాదిస్తుంది.
తమన్నాకు ఆటోమొబైల్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువే. రూ.43.50 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ 320ఐ, రూ.1.02 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ ఉన్నాయి.
అలాగే రూ.29.96 లక్షల మిత్సుబిషి పజెరో స్పోర్ట్, కార్వాలే అండ్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయట.
తమన్నాకు ముంబైలోని జుహు ప్రాంతంలో లగ్జరీ భవనం ఉంది. హైదరాబాద్ లోనూ సొంతంగా ఇళ్లు ఉంది. ఏడాదికి 12 కోట్లు సంపాదిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్