ఈ ఏడాది సందడి చేసిన సీక్వెల్స్.. ఏది హిట్టు.? ఏది ఫట్టు.? 

21 December 2024

Battula Prudvi

రెండేళ్ల క్రితం వచ్చిన ‘డీజే టిల్లు’కి కొనసాగింపుగా ఈ ఏడాది వచ్చిన ‘టిల్లు స్క్వేర్‌’ బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాన్ని అందుకుంది.

నారా రోహిత్‌ హిట్ పొలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ప్రతినిధి’కి సీక్వెల్‎ ‘ప్రతినిధి 2’. ఈ ఏడాది వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.

వీటి తర్వాత వచ్చిన ‘డబల్ ఇస్మార్ట్‌’ మూవీ డిజాస్టర్ అయింది. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి సీక్వెల్.

‘మత్తు వదలరా’కి కొనసాగింపుగా వచ్చిన సినిమా ‘మత్తు వదలరా 2’. శ్రీసింహా, సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ హిట్ అయింది.

దీని తర్వాత వచ్చిన సీక్వెల్ ‘పుష్ప 2: ది రూల్‌’ బ్లాక్‎బస్టర్ టాక్‎తో బాక్స్ వద్ద ఇప్పటికే 1500 కోట్లు కొల్లగొట్టింది.

తాజాగా విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ‘విడుదల 2’కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ‘విడుదల’ సీక్వెల్.

‘స్త్రీ’ మూవీకి కొనసాగింపుగా వచ్చిన బాలీవుడ్ హారర్ మూవీ ‘స్త్రీ 2’ బ్లాక్‎బస్టర్‎‎గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద 500 కోట్లపైగా వసూళ్లు చేసింది.

బాలీవుడ్ హారర్ హిట్ సిరీస్ ‘భూల్ భూలయ్యా’ నుంచి వచ్చిన థర్డ్ ఇంస్టాల్మెంట్ మూవీ ‘భూల్ భూలయ్యా 3’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.