
Alleti Maheshwar Reddy: తెలంగాణ కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా రాజీనామా లేఖను ఖర్గేకి పంపించారు. అనంతరం మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ ఇన్ ఛార్జ్ తురుణ్ చుగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. AICC కార్యక్రమాల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న మహేశ్వరరెడ్డి.. గత కొంత కాలం నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి దగ్గరవుతున్నారని మహేశ్వరరెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో తనకు నోటీస్ ఇచ్చే అధికారం టీపీసీసీకి లేదని స్పష్టం చేసిన మహేశ్వరరెడ్డి.. ఖర్గేను కలుస్తానని ఢిల్లీ వచ్చారు. అనంతరం జరిగిన పరిణామాలతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈటలతో కలిసి గురువారం ఉదయం మహేశ్వర్ రెడ్డి తరుణ్ చుగ్ నివాసానికి చేరుకుని భేటీ అయ్యారు.
బండి సంజయ్, ఈటల రాజేందర్, తరుగ్ చుగ్ తో సమావేశం అనంతరం అక్కడి నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసేందుకు మహేశ్వరరెడ్డి బయలుదేరారు. అక్కడ ఆయన నివాసంలో బీజేపీలో చేరనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..