Telangana: ఉదయం చలి.. పగలు వేడి.. మరో రెండు రోజులు ఇంతే.. విచిత్ర వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి..
మరో రెండురోజుల పాటు చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే సగానికిపైగా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ అలర్ట్ జారీ చేసింది. అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణలో..
తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో సాధారణ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండురోజుల పాటు చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే సగానికిపైగా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ అలర్ట్ జారీ చేసింది. అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణలో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది.. ఉదయం చలి పులి దాడి చేస్తుంటే.. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అదే వాతావరణం మరో వారం కొనసాగుతుందని తెలిపారు. అయితే, ఇదే పరిస్థితి రెండు రాష్ట్రాల్లో ఉంటుందని వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఇక ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉంటోంది.
తెలంగాణలో చలి మరో రెండు రోజులపాటు అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యలో కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే సూచనలున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెదర్ బులెటిన్ లో తెలిపింది.
అతి తక్కువగా కుమురం భీం జిల్లా సిర్పూర్(యు)లో 6.7 డిగ్రీలు నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది.. చలి పులి పంజా విసరడంతో ప్రతి ఒక్కరూ చలి మంటలతో అంటకాగుతున్నారు. మరీ ముఖ్యంగా ఉదయాన్నే పనీ పాటా చేసుకోవాలంటే తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. నిర్మల్ జిల్లా, ఖానాపూర్ లో అయితే అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా.. చలికి గజగజా వణుకుతున్నారక్కడి ప్రజలు. వృద్ధులైతే.. ఉదయం పది గంటల వరకూ చలిమంటలను వదలడం లేదు.
విజయనగరం జిల్లాను పొగ మంచు కమ్మేసింది.. మంచు తీవ్రత అమాంతం పెరిగిపోవడంతో ఎముకలు కొరికే చలిలో బయటకు రాలేక అవస్థలు పడుతున్నారు జిల్లా వాసులు. పార్వతీపురం మన్యంలోని కొన్ని గిరిజన గ్రామాలు ఊటీని తలపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం