AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేదోడి ఇంట్లో ససన్నబియ్యంతో సీఎం రేవంత్ రెడ్డి సహాపంక్తి భోజనం..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి హోదా మరిచి సామాన్యుడిలా మారిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో సీఎం రేవంత్ పర్యటించారు. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్దిదారుడి ఇంటికి వెళ్లారు. సన్నబియ్యంతో వండిన భోజనం అందరితో కలిసి చేశారు.

పేదోడి ఇంట్లో ససన్నబియ్యంతో సీఎం రేవంత్ రెడ్డి సహాపంక్తి భోజనం..!
Cm Revanth Reddy Meals
Balaraju Goud
|

Updated on: Apr 06, 2025 | 8:41 PM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి హోదా మరిచి సామాన్యుడిలా మారిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో సీఎం రేవంత్ పర్యటించారు. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్దిదారుడి ఇంటికి వెళ్లారు. సన్నబియ్యంతో వండిన భోజనం అందరితో కలిసి చేశారు. అనంతరం వారి జీవన పరిస్థితులు, కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలోని ప్రతి నిరుపేద సన్నబియ్యంతో అన్నం తినాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో ఒక లబ్దిదారుడి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సహపంక్తి భోజనం చేశారు. సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో సహపంక్తి భోజనం చేసిన సీఎం.. లబ్ధి దారు కుటుంబం యోగ క్షేమాలు అడిగి తెలుసు కున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యురాలు తులసమ్మను ఆరా తీశారు. దొడ్డు బియ్యం పంపిణీ చేసినపుడు అసలు తీసుకునేందుకే ఆసక్తి చూపేవాళ్లం కాదని ఇంటిల్లాలు తులసమ్మ సమాధానమిచ్చింది. ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు.

200 యూనిట్స్ ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాలు అందుతున్నాయా అని సీఎం రేవంత్ ఆరా తీశారు. ఉచిత బస్సు ప్రయాణం తమకు ఎంతో ఉపయోగ పడుతుందని తులసమ్మ సంతోషం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. దేశంలోనే తొలిసారి రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.

వీడియో చూడండి..

ఉగాది సందర్భంగా హుజూ ర్‌‌నగర్‌‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌‌ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ స్కీమ్‌ను ప్రారంభించారు. పది మంది లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సభా వేదికపైన సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..