Telangana: రాష్ట్రంలో కొత్తగా 16 నేషనల్ హైవేలు.. భూసేకరణ పూర్తి చేయాలంటూ సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ
జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి వేగవంతం చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే అనేక కొత్త రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. మరికొన్ని రహదారుల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.

తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ముఖ్యంగా జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి వేగవంతం చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే అనేక కొత్త రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. మరికొన్ని రహదారుల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం భూసేకరణ వేగవంతం చేయాలని కోరారు. తెలంగాణలో రహదారులతోపాటు విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
తెలంగాణలో 2,500 కి.మీ మేర జాతీయ రహదారులు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం మరో 2,500 కి.మీ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అలాగే రీజినల్ రింగ్ రోడ్డు (RRR) కాకుండా, రూ. 12,619.27 కోట్ల అంచనా వ్యయంతో 691.52 కిలోమీటర్ల పొడవున 16 జాతీయ రహదారులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 1,550.529 హెక్టార్ల భూమి అవసరం కాగా, ఇప్పటి వరకు 904.097 హెక్టార్ల భూమిని మాత్రమే సేకరించారు. మిగిలిన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇదివరకే లేఖలు రాసిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.
దాదాపు 66 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రాంతం అంతటా మొత్తం 2,500 కి.మీ రహదారులు నిర్మించారని, గత 10 సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం జాతీయ రహదారులను 2,500 కి.మీ నుండి 5,000 కి.మీకి రెట్టింపు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలలో కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా, వాటిలో 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ 11 సంవత్సరాలలో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులను నిర్మించింది రూ. 1,20,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ 11 సంవత్సరాలలో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ. 1,20,000 కోట్లకు పైగా ఖర్చుతో జాతీయ రహదారులను నిర్మించిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇది ఆయా ప్రాంతాల సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక పురోగతికి ఎంతో దోహదపడిందన్నారు. అంతేకాకుండా, అనేక ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు తొలగిపోయాయి. రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గాయి. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో, వాటిలో 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానించిన ఘనత ప్రధానమంత్రి మోదీకే దక్కుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.
అదేవిధంగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం నిర్మిస్తున్న జాతీయ రహదారులకు అవసరమైన భూమిని సకాలంలో సేకరించి అందిస్తే, కేంద్ర ప్రభుత్వం సంబంధిత రహదారి ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడం సాధ్యమవుతుందని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, సంబంధిత జాతీయ రహదారుల ప్రాజెక్టులకు అవసరమైన భూమిని సకాలంలో అందించి, నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యర్థించారు.
Addressed a letter to the Hon'ble CM of Telangana on expediting land acquisition for pending National Highway (NH) projects. In my letter, I highlighted the following matters:
From the time of liberation of Hyderabad from Nizams, till 2014, a total of 2,500 km of NH were… pic.twitter.com/IuMSQBNHvW
— G Kishan Reddy (@kishanreddybjp) April 6, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..