Revanth Reddy: బరిలోకి దిగితే ఇలానే ఉంటాది.. 54 ఏళ్ల వయస్సులోనూ ఇరగదీసిన సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్..
ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయి. ఇక బటన్ నొక్కుడే మిగిలింది. దీంతో.. రెండు నెలలుగా ప్రచారంలో బిజీబిజీగా గడిపిన నాయకులు కాస్త రిలాక్స్ అవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి రిలాక్స్ అయ్యారు. యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడారు.
ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయి. ఇక బటన్ నొక్కుడే మిగిలింది. దీంతో.. రెండు నెలలుగా ప్రచారంలో బిజీబిజీగా గడిపిన నాయకులు కాస్త రిలాక్స్ అవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి రిలాక్స్ అయ్యారు. యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడారు. సీఎం రేవంత్‌కు స్పోర్ట్స్‌లో ఇష్టమైన ఆట ఫుట్ బాల్ కావడంతో.. ఆయనకు ఖాళీ దొరికినప్పుడల్లా ఆడుతుంటారు. ముఖ్యంగా స్ట్రెస్ బస్టర్ కోసం ఫుట్‌బాల్ ఆడుతూ రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తారు. ఎలక్షన్స్ ప్రచారం ముగియడంతో ఆదివారం ఉదయమే.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఫుట్ బాల్ ఆడుతూ రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. 54 ఏళ్ల వయస్సులోనూ రేవంత్ రెడ్డి విద్యార్థుల వెంట పరుగులు తీస్తూ ఫుట్ బాల్ ఆడుతూ కనిపించారు. రేవంత్ ఆటను చూసిన పలువురు ఆయన్ను అభినందిస్తూ ఎంజాయ్ చేశారు..
వీడియో చూడండి..
ఇదిలాఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది.. అధికారులు ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలతో పాటు ఇతర ఎన్నికల సామాగ్రిని అందిస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో.. పోలింగ్ కేంద్రాలను సెక్టార్స్‌గా డివైడ్ చేసి.. బూత్‌ల వారీగా మెటీరియల్‌ను అందిస్తున్నారు. సాయంత్రంలోగా పోలింగ్ కేంద్రాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు అధికారులు..
ఇదిలాఉంటే.. ఓటు వేసేందుకు జనం సొంతూళ్లకు బయల్దేరుతున్నారు. బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో రద్దీ కనిపిస్తోంది. టోల్‌ప్లాజ్‌దగ్గర ట్రాఫిక్ జామ్‌లు కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల ప్రజల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..