AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం ఆరా.. రేవంత్ రెడ్డి ఆదేశాలతో యశోద హాస్పిటల్‌కు ఆరోగ్యశాఖ కార్యదర్శి

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం కార్యాలయం ఆరా తీసింది. కేసీఅర్‌ యశోదా ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వం తరపున ఐఏఎస్ రిజ్వీను యశోదాకు పంపి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం ఆరా.. రేవంత్ రెడ్డి ఆదేశాలతో యశోద హాస్పిటల్‌కు ఆరోగ్యశాఖ కార్యదర్శి
Kcr Revanth Reddy
Balaraju Goud
|

Updated on: Dec 08, 2023 | 12:48 PM

Share

కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం కార్యాలయం ఆరా తీసింది. కేసీఅర్‌ యశోదా ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వం తరపున ఐఏఎస్ రిజ్వీను యశోదాకు పంపి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. గాయం కారణంగా యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేసీఆర్‌ ఆరోగ్యంపై సమాచారాన్ని తనకు తెలియజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీకి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి రిజ్వీ వైద్యులతో మాట్లాడారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆయన మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డికి పరిస్థితిని వివరించారు రిజ్వీ. – కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో రిజ్వీ మాట్లాడారు.

గురువారం అర్థరాత్రి బాత్‌రూమ్‌లో కేసీఆర్‌ కాలు జారిపడటంతో తుంటికి గాయమయింది. దీంతో హుటాహుటిన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ నుంచి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు, సీటీ స్కాన్‌ కూడా చేసి శస్త్రచికిత్స అవసరం తెలిపారు. తాజాగా కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కేసీఆర్‌ ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి చేయాలని సూచించారు.

అటు కేసీఆర్‌ ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలిసి పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు అంతా సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్తున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు కూడా కేసీఆర్‌ను పరామర్శించారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్‌ చేశారు ప్రధాని మోదీ. కేసీఆర్‌ గాయపడ్డారని తెలిసి బా ధకలిగిందన్న మోదీ..కేసీఆర్‌ ఆరోగ్యం బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాని చెప్పారు. గాయం నుంచి కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలంటూ ట్వీచ్‌ చేశారు ప్రధాని మోదీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు