
తెలంగాణ పాలిటిక్స్ హీట్ పెరుగుతుంది. ఇన్ని రోజులు బడ్జెట్ సమావేశాలతో బిజీగా ఉన్న సీఎం రేవంత్ ఫిబ్రవరి 19న సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సీఎం ఢిల్లి టూర్‌తో గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న కేబినేట్ విస్తరణ, కార్పోరేషన్ చైర్మన్ల భర్తీ, పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ మరోసారి తెరపైకి వచ్చింది. అసలు సీఎం రెండు రోజులు ఏం చేయబోతున్నారు అనే ఆసక్తి ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్ పెంచుతోంది. సాయంత్రం ఢిల్లీ బయలుదేరిన సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ ధీపాదాస్ మున్షి కూడ ఉన్నారు. ఇక ఈరోజు సీఎం రేవంత్ ఢిల్లిలో జరిగే కర్ణాటక కాంగ్రెస్ ఇంచార్జ్ రణధీప్ సుర్జీవాళ్ల కుమారుడి పెళ్లికి హజరుకానున్నారు. రేపు కూడా సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు. ఏఐసిసి పెద్దలను కలిసి రాష్ట్ర పరిస్థితుల గురించి వివరించనున్నారు. ఈ క్రమంలోనే కేబినేట్ విస్తరణకు సంబంధించి కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.
కేబినేట్లో ఇప్పటి వరకు 12 మందిని మాత్రమే తీసుకున్నారు. ఇంకో ఆరుగురికి అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు విస్తరణ చేపట్టలేదు. ఇప్పుడు ఢిల్లీ టూర్‌తో దీనిపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. ఇక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేబినేట్ విస్తరణ తప్పనిసరి అయింది. ఇప్పటికే 10 ఉమ్మడి జిల్లాలో రెండు ఉమ్మడి జిల్లాలకు ప్రాధాన్యత దక్కలేదు. అవే నిజామాబాద్, అదిలాబాద్. ఈ రెండు జిల్లాలకు సంబంధించి మంత్రులను భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. నిజామాబాద్ నుండి మదన్ మోహన్ రావుతో పాటు, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కేబినెట్ రేసులో ఉన్నారు. మదన్ మోహన్ మొదటిసారి ఎమ్మెల్యే కాగా.. సుదర్శన్ రెడ్డి గతంలో మంత్రిగా పని చేసారు. కానీ ఇప్పటికే కేబినేట్ నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇచ్చినందున మరో రెడ్డికి అవకాశం ఉంటుదా అనేది ఆసక్తిరేపుతోంది. అయితే మదన్ మోహన్ రావు మాత్రం తనకు క్యాబెనెట్ బెర్త్ పక్క అనే నమ్మకంతో ఉన్నారు. గతంలో అదిలాబాద్ జిల్లా నుంచి కూడా కేబినేట్లో చోటు దక్కలేదు. ఉమ్మడి అదిలాబాద్ నుండి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటుగా గడ్డం బ్రదర్స్ కేబినేట్లో చోటు కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ ఢిల్లి పర్యటనతో ఈ రెండు జిల్లాలకు సంబంధించిన క్లారిటి ఏమైన వస్తుందా అన్న విషయం చూడాల్సి ఉంది. ఇక కార్పోరేషన్ పదవుల భర్తీపై కూడా సీఎం ఢిల్లి టూర్‌తో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..