BRS Party: రేపు రెండు చోట్ల కేసీఆర్ నామినేషన్.. కామారెడ్డిలో బహిరంగ సభ

| Edited By: TV9 Telugu

Nov 09, 2023 | 5:50 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఈ దఫా రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్న విషయం మనకు తెలిసిందే. తాను పోటీ చేయనున్న గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆయన నామినేషన్‌ పత్రాలకు కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి సన్నిధిలో పూజాదికాలు నిర్వహించారు. గజ్వేల్‌లో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి కేసీఆర్‌ సమర్పించనున్నారు.

BRS Party: రేపు రెండు చోట్ల కేసీఆర్ నామినేషన్.. కామారెడ్డిలో బహిరంగ సభ
Release of the second schedule of CM KCR's Telangana election campaign
Follow us on

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఈ దఫా రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్న విషయం మనకు తెలిసిందే. తాను పోటీ చేయనున్న గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆయన నామినేషన్‌ పత్రాలకు కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి సన్నిధిలో పూజాదికాలు నిర్వహించారు. గజ్వేల్‌లో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి కేసీఆర్‌ సమర్పించనున్నారు. సీఎం నామినేషన్‌ సందర్భంగా గజ్వేల్‌లో ఏర్పాట్లను మంత్రి హరీష్‌ రావు పరిశీలించారు. ఇప్పటికే గజ్వేల్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించడంతో ఎటువంటి ఆర్భాటం లేకుండా నామినేషన్‌ ఘట్టం ఉంటుందని హరీష్‌ రావు వెల్లడించారు. పెద్దవాళ్లపై పోటీ చేస్తే పెద్దవాళ్లైపోతామనే భావనతో కొందరు గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్నారని హరీష్‌ రావు అన్నారు.

అయితే ప్రజాస్వామ్యంలో పోటీ సహజం కాబట్టి తాము ఆహ్వానిస్తామని తెలిపారు. లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో కేసీఆర్‌ గజ్వేల్‌లో విజయం సాధిస్తారని హరీష్‌ రావు అన్నారు. ఎప్పుడెప్పుడు ఓటు వేసి కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలని గజ్వేల్‌ ఓటర్లు తహలాడుతున్నారని అన్నారు. ఎంత మంది డీకేలు, పీకేలు వచ్చినా తెలంగాణ ఏకే47 కేసీఆర్‌కు ఏమి కాదని తెలిపారు. గజ్వేల్‌లో నామినేషన్ తర్వాత అక్కడి నుంచి కేసీఆర్‌ నేరుగా కామారెడ్డి వెళ్తారు. అక్కడ నామినేషన్ సమర్పించిన తర్వాత బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొంటారు. ప్రచారం చివరి రోజు గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ సభ ఉంటుంది. 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్‌లోనే చివరి సభ నిర్వహించి ప్రచారానికి కేసీఆర్‌ ముగింపు పలికారు. అదే సెంటిమెంట్‌ను ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్‌ అనుసరించబోతున్నట్లు ప్రకటించారు.

ఆలోచించి ఓటేయండి.. ఆగం కావొద్దు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత ప్రజాశీర్వాద సభకు హాజరయ్యారు. ఎన్నికలు వస్తాయి..పోతాయి. ఓట్ల కోసం ఎందరో వస్తుంటారు..పోతుంటారు. ఆగం ఆగం కావద్దు. ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్‌. కాంగ్రెస్‌, బీజేపీలపై తనదైన శైలిలో విమర్శలు సంధించారు. సీఎం కేసీఆర్ రాకతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి గులాబీమయం అయింది. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే బీఆర్‌ఎస్‌ గెలవాలన్నారు కేసీఆర్‌. బీఆర్ఎస్‌ పార్టీకి ప్రజలే బాసులు. కాంగ్రెస్‌, బీజేపీలకు మాత్రం బాసులు ఢిల్లీలో ఉంటారన్నారు. అన్నీ ఆలోచించి ప్రజలు ఓటేయాలని, అభ్యర్థుల గుణగణాలు, పార్టీల నేపథ్యం చూసి నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి

దేశంలోనే 24 గంటలు కరెంట్‌ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు కేసీఆర్‌. గుజరాత్‌లో కూడా కరెంట్‌ 24 గంటలు లేదన్నారు. నాటి కాంగ్రెస్‌ పాలనలో కేంద్రం దగ్గర తెచ్చిన అప్పులు తిరిగి కట్టలేక.. సింగరేణిలో 49 శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిని ముంచింది కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. చెన్నూరులో చెల్లని రూపాయి.. బెల్లంప‌ల్లిలో చెల్లుత‌దా అని ప్రశ్నించారు. ఇవాళ డ‌బ్బు క‌ట్టలు ప‌ట్టుకొని వస్తారు కానీ ఎన్నిక‌ల తర్వాత మ‌ళ్లీ క‌న‌బడరన్నారు. అన్నీ ఆలోచించి బెల్లంపల్లి ప్రజలు ఓటు వేయాలన్నారు. ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు పరిష్కరించుకుంటున్నామని.. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు కేసీఆర్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..