CM KCR Bihar Visit: ఇవాళ బీహార్ టూర్‌కు సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై సీఎం నితీష్‌తో చర్చలు..!

CM KCR to Meet Nitish Kumar: సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి పాట్నాకు బయలుదేరి వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు, గాల్వాన్ లోయ ఘర్షణల్లో ..

CM KCR Bihar Visit: ఇవాళ బీహార్ టూర్‌కు సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై సీఎం నితీష్‌తో చర్చలు..!
Cm Kcr
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:25 PM

ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) బీహార్ టూర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ ఇద్దరు నేతల కలయిక తరువాత భవిష్యత్తు పరిణామాలు ఏంటనేది అందరూ ఆసక్తిగా మారింది. బీజేపీ వ్యతిరేక కూటమికి బీహార్‌లో బీజం పడనుందా?  సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి పాట్నాకు బయలుదేరి వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు, గాల్వాన్ లోయ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బీహార్‌కు చెందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. అమరులైన ఒక్కో సైనిక కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించనున్నారు కేసీఆర్.

సైనిక కుటుంబాలతో పాటు కొద్ది నెలల క్రితం సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని  ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేయనున్నారు. మరణించిన ఒక్కో వలస కార్మిక కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కులను అందజేయనున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు.

చెక్కుల పంపిణీ తర్వాత నితీష్ కుమార్‌తో కలిసి లంచ్‌ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఈ మీటింగ్‌పైనే ఇప్పుడు గల్లీ బాయ్ దగ్గర నుంచి జాతీయ మీడియా వరకు ఫోకస్ పెట్టింది. జాతీయ రాజకీయాలపైనే వీళ్లిద్దరి టాక్ ఉండబోతుంది. అయితే ఏ అంశాలపై చర్చిస్తారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీడియాతో ఏం మాట్లాడతారనేదే ఇంట్రస్టింగ్ టాపిక్.

గత కొద్ది రోజులుగా బీహార్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ సపోర్ట్‌తో ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. మళ్ళీ ఆర్‌జేడీ, ఇతర పార్టీల మద్ధతుతో కలిసి సీఎం పగ్గాలు చేపట్టారు. దాదాపు వారం రోజుల పాటు బీహార్ రాజకీయాలు దేశ వ్యాప్తంగా చర్చకి దారి తీశాయి. ఈటైమ్‌లో సీఎం కేసీఆర్ టూర్ ఆసక్తిని రేపుతోంది. ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలతో పాటు ప్రస్తుతం దేశంలో రాజకీయ పరిస్థితులపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీలు కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా ఆ రాష్ట్రంలో ఈడీ దాడులను వ్యతిరేకిస్తూ, బీజేపీ విధానాలను ఎండ గడుతూ వస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడి దాడుల నేపథ్యంలో బీజేపీపై గుర్రుగా ఉన్నారు. తాజాగా నితీష్ కుమార్ బీజేపీ నుంచి బయటకు వచ్చారు. వీళ్లందరినీ కలుపుకుని పోయి.. బీజేపీ వ్యతిరేక కూటమి దిశగా కేసీఆర్ అడుగులు వేసే అవకాశాలు ఉన్నట్టు పొలిటికల్ టాక్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం