Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: తెలంగాణ ఘనకీర్తి దశదిశలా చాటాలి.. దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ సమీక్ష..

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ముఖ్యమంత్రి KCR సమీక్ష నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించి వివిధ శాఖలు అందజేసిన ప్రతిపాదనలపై అధికారులతో సీఎం చర్చించారు.

CM KCR: తెలంగాణ ఘనకీర్తి దశదిశలా చాటాలి.. దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ సమీక్ష..
Cm Kcr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 20, 2023 | 9:10 PM

తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడంతో ఆ దిశగా కార్యాచరణను ప్రభుత్వం వేగవంతం చేసింది. జూన్‌ రెండు నాటికి తొమ్మిది సంవత్సరాలు పూర్తై పదో సంవత్సరంలోకి తెలంగాణ అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా 21 రోజుల దశాబ్ది వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తి దశదిశలా చాటేలా రాష్ట్రమంతా పండగ వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే మంత్రి హరీశ్‌ రావు ఉత్సవాలకు సంబంధించి మంత్రులు, వివిధ శాఖల అధికారులతో చర్చించి ముసాయిదా ప్రణాళిక రూపొందించారు. జూన్‌ రెండున హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు. జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు, అక్కడి ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖలు సాధించిన విజయాలు చాటి చెప్పేలా శాఖలవారీగా డాక్యుమెంటరీలు రూపొందనున్నాయి.

ఈ క్రమంలో వివిధ శాఖలు అందజేసిన ప్రతిపాదనలపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఏర్పాట్లన్నీ పకడ్బంధీగా ఉండాలని.. దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. డాక్టర్‌ BR అంబేడ్కర్‌ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ CV ఆనంద్‌, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌ శర్మ, సోమేశ్‌ కుమార్‌, సీఎస్‌ శాంతి కుమారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దశాబ్ది ఉత్సవ ప్రణాళికకు ఈ సమావేశంలో తుది రూపు ఇవ్వనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

హిందీని రుద్దడాన్ని నేను వ్యతిరేకించాను!
హిందీని రుద్దడాన్ని నేను వ్యతిరేకించాను!
భానుడి భగభగలు.. ఏపీలో ఆ జిల్లాలోనే అత్యధికం!
భానుడి భగభగలు.. ఏపీలో ఆ జిల్లాలోనే అత్యధికం!
మిత్రుడి మరణం.. తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించిన ఏనుగు..
మిత్రుడి మరణం.. తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించిన ఏనుగు..
బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో మైండ్ బ్లాక్ చేస్తున్న రంగస్థలం బ్యూటీ
బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో మైండ్ బ్లాక్ చేస్తున్న రంగస్థలం బ్యూటీ
జాక్‌పాట్‌ కొట్టిన గోల్డ్‌ బాండ్స్‌ ఇన్వెస్టర్లు.. మూడింతల లాభం!
జాక్‌పాట్‌ కొట్టిన గోల్డ్‌ బాండ్స్‌ ఇన్వెస్టర్లు.. మూడింతల లాభం!
అప్పుడే పుట్టిన బిడ్డను చంపేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టేసిన స్త్రీ
అప్పుడే పుట్టిన బిడ్డను చంపేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టేసిన స్త్రీ
చేతిరాత బడ్జెట్టును ప్రవేశపెట్టిన మంత్రి వీడియో
చేతిరాత బడ్జెట్టును ప్రవేశపెట్టిన మంత్రి వీడియో
వయ్యారాలతో మతిపోగొడుతున్న ఆర్జీవీ హీరోయిన్..
వయ్యారాలతో మతిపోగొడుతున్న ఆర్జీవీ హీరోయిన్..
అమెరికాలో సుదీక్ష మిస్సింగ్‌.. ఆ బీచ్‌లో ఏం జరిగి ఉంటుంది?వీడియో
అమెరికాలో సుదీక్ష మిస్సింగ్‌.. ఆ బీచ్‌లో ఏం జరిగి ఉంటుంది?వీడియో
ఎండాకాలం వచ్చింది.. ఏటవుతుందో.. భయపెడుతున్న బండరాయి
ఎండాకాలం వచ్చింది.. ఏటవుతుందో.. భయపెడుతున్న బండరాయి