AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాధ్యతా రాహిత్యం వహిస్తే..వేటు తప్పదుః సీఎం కేసీఆర్‌

పంచాయతీరాజ్ పై ఈ నెల 6 నుంచి 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ వేదికగా పంచాయతీరాజ్‌పై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామాభివృద్ధిపై సీఎం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పంచాయితీలకు నిధుల కొరత ఉండదనీ, ప్రతీ గ్రామంలోనూ రాబోయే 6 నెలల్లోపు శ్మశాన వాటికలు నిర్మించాలనీ, అందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం కేటాయిస్తుంది. చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు […]

బాధ్యతా రాహిత్యం వహిస్తే..వేటు తప్పదుః సీఎం కేసీఆర్‌
Anil kumar poka
|

Updated on: Sep 03, 2019 | 6:00 PM

Share

పంచాయతీరాజ్ పై ఈ నెల 6 నుంచి 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ వేదికగా పంచాయతీరాజ్‌పై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామాభివృద్ధిపై సీఎం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పంచాయితీలకు నిధుల కొరత ఉండదనీ, ప్రతీ గ్రామంలోనూ రాబోయే 6 నెలల్లోపు శ్మశాన వాటికలు నిర్మించాలనీ, అందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం కేటాయిస్తుంది. చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు లేనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ అవసరాల కోసం ట్రాక్టర్ సమకూర్చుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. 500 జనాభా ఉన్నటువంటి ప్రతి గ్రామానికి రూ. 8 లక్షలు మంజూరు చేస్తామని ఆయన అన్నారు.

సరిగా పని చేయని కలెక్టర్లకు వార్షిక ప్రణాళికలో ప్రతికూల మార్కులు వేస్తామన్నారు. బాధ్యతా రాహిత్యం, లక్ష్యాలు చేరుకోని సర్పంచ్‌లపై వేటు తప్పదన్నారు. మిషన్‌ భగీరథతో పంచాయతీలపై మంచినీటి భారం తీరిందన్నారు. ఆరో తేదీ నుంచి 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలనీ, హరితహారంలో, ఇప్పుడు పంపిణీ చేసి నాటిన 85 శాతం మొక్కలు బతికి తీరాల్సిందేననీ, లేని పక్షంలో సర్పంచ్‌లపై వేటు వేస్తామన్నారు. లక్ష్యాన్ని సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. అలసత్వం, అజాగ్రత్త ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు. కలెక్టర్లు, మండల స్థాయి అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. పచ్చదనం బాగా ఉండేలా చూసేలా కలెక్టర్లకు మార్కులు ఇస్తామని, పచ్చదనం బాగా చూడని కలెక్టర్లకు ప్రతికూల మార్కులు ఇస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు.