CM KCR: వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం.. కీలక ప్రకటన చేసిన సీఎం కేసీఆర్..
వనపర్తి జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు CM కేసీఆర్. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) స్పష్టం చేశారు. వనపర్తి జిల్లాలో మన ఊరు-మన బడి(Mana Ooru-Mana Badi) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు CM కేసీఆర్. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మన ఊరు – మన బడి పైలాన్‌ను సీఎం కేసీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కలిసి ఆవిష్కరించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసేందుకే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లు చెప్పారు సీఎం కేసీఆర్. తామంతా సర్కారీ బడుల్లో చదివి పైకి వచ్చినవాళ్లమేనని గుర్తుచేశారు. త్వరలోనే ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభం అవుతుందన్నారు. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్. వనపర్తిలో అన్నిహంగులతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయాలను ప్రారంభించారు CM కేసీఆర్. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వనపర్తిలో కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన CM కేసీఆర్.. జిల్లా అధ్యక్షుడిని కూర్చోబెట్టి ఆశీర్వదించారు. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో నేరుగా చిట్యాల చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ మార్కెట్ యార్డ్‌ని ప్రారంభించారు.