వారణాసిలో సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యుల పర్యటన.. స్వామివారికి ప్రత్యేక పూజలు.. పట్టువస్త్రాల సమర్పణ

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబసభ్యులు ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో పర్యటించనున్నారు. ఈరోజు, రేపు ఉత్తరప్రదేశ్‌లోని..

వారణాసిలో సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యుల పర్యటన.. స్వామివారికి ప్రత్యేక పూజలు.. పట్టువస్త్రాల సమర్పణ
Follow us
K Sammaiah

|

Updated on: Jan 28, 2021 | 1:05 PM

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబసభ్యులు ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో పర్యటించనున్నారు. ఈరోజు, రేపు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సీఎం సతీమణి శోభ, కూతురు ఎమ్మెల్సీ కవిత, ఇతర కుటుంబసభ్యులు వారణాసికి చేరుకున్నారు.

తొలుత అస్సి ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బోటులో ప్రయాణం చేయనున్నారు. దశాశ్వమేధ ఘాట్‌లో గంగా ఆర్తి, గంగా పూజను తిలకిస్తారు. అనంతరం అస్సి ఘాట్‌కు బోటులో‌ తిరుగు‌ ప్రయాణం కానున్నారు. తర్వాత సంకట్‌మోచన్ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

వారణాసి పర్యటనపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథున్ని కుటుంబ సభ్యులతో పాటు దర్శించుకోబోతుండటం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

గుడిలో పూజలు చేస్తూ ప్రాణాలొదిలిన మాజీ ఎమ్మెల్యే

కుటుంబ సమేతంగా అక్షరధామ్ ఆలయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పూజలు, ఇదే దీపావళి