AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ జిల్లాకొచ్చిన కొత్త చిక్కు… ఎవరికి మర్యాద చేయాలో తెలియక అధికారుల అవస్థలు.. జఠిలంగా జడ్పీ పీఠం

సాధారణంగా జిల్లా పరిషత్ అంటే ఒక్కరే జడ్పీ ఛైర్మన్ వుంటారు..ఆ జడ్పీ చైర్మన్ చెప్పిందే వేదం..కానీ ఆ జిల్లాకు మాత్రం ముగ్గురు జడ్పీ చైర్ పర్సన్లు..ఎవరి పెత్తనం వారిదే.. ముగ్గురూ -ముగ్గురే..

ఆ జిల్లాకొచ్చిన కొత్త చిక్కు... ఎవరికి మర్యాద చేయాలో తెలియక అధికారుల అవస్థలు.. జఠిలంగా జడ్పీ పీఠం
Trs
Jyothi Gadda
|

Updated on: May 24, 2022 | 9:32 PM

Share

సాధారణంగా జిల్లా పరిషత్ అంటే ఒక్కరే జడ్పీ ఛైర్మన్ వుంటారు..ఆ జడ్పీ చైర్మన్ చెప్పిందే వేదం..కానీ ఆ జిల్లాకు మాత్రం ముగ్గురు జడ్పీ చైర్ పర్సన్లు..ఎవరి పెత్తనం వారిదే.. ముగ్గురూ -ముగ్గురే.. వారిలో ఎవరికి జడ్పీ చైర్ పర్సన్ గా ప్రోటోకాల్ వర్తిస్తుందో అర్థంకాక ఒకవైపు క్యాడర్, మరోవైపు అధికార యంత్రాంగం నిత్యం అయోమయం చెందుతున్నా రట.. అయితే, ఈ పరిస్థితి ఎదురైంది ఎక్కడో కాదు..తెలంగాణ రాష్ట్రంలో భౌగోళికంగా అతిపెద్ద జిల్లా జయశంకర్ భూపాలపల్లిలో..

రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన జిల్లా ఇది.. ఈ జిల్లాలో అధికారికంగా జక్కుల శ్రీహర్షిని జడ్పీ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనధికారికంగా ఈ జిల్లాపై మరో ఇద్దరు జడ్పీ చైర్ పర్సన్స్ పెత్తనం కొనసాగుతుంది.. పక్కనే ఉన్న పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధు, వరంగల్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి కూడా ఈ జిల్లాలోనే రెగ్యులర్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు..ఈ ఇద్దరు భూపాలపల్లి జిల్లా పై ఫోకస్ చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది…వరంగల్ జడ్పీ చైర్ ప్రర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న గండ్ర జ్యోతి ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా TRS పార్టీ ప్రెసిడెంట్ గా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. పైగా తన భర్త గండ్ర వెంకటరమణారెడ్డి కూడా భూపాలపల్లి MLAగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు… దీంతో స్థానిక జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిని కంటే గండ్ర జ్యోతే ఈ జిల్లాలో చురుగ్గా వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ జిల్లా కంటే ఈ జిల్లా లోనే పార్టీలో, ప్రజలలో పట్టు సాధించారు..

మరోవైపు, మంథని నియోజక వర్గం పరిధిలోని ఐదు మండలాలు కాటారం, మహాదేవపూర్, పలిమేల, మహాముత్తరాం, మల్హర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోనే ఉన్నాయి.. దీంతో మంథని నియోజకవర్గానికి TRS పార్టీ ఇంచార్జ్ గా ఉన్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు కూడా తను బాధ్యతలు నిర్వహిస్తున్న ఐదు మండలాల్లో పట్టు కోల్పోకుండా పార్టీ కార్యక్రమాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.. ఆ ఐదు మండలాల్లో ఈయనే అనధికారిక జడ్పీ చైర్మన్…

ఒక్క జిల్లాలో ముగ్గురు జడ్పీ చైర్ పర్సన్స్ పెత్తనం కొనసాగుతుండడంతో పార్టీ క్యాడర్ కు పరేషాన్ తప్పడం లేదు… కొంతమంది బహిరంగంగా వారి అభిమాన నేత పేరుతో పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటుంటే.. మరొకొందరు కార్యకర్తలు మాత్రం కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లు అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారట.. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముగ్గురు జడ్పీ చైర్మన్లు ఉన్న జిల్లాగా రాష్ట్రంలోనే ప్రత్యేక చర్చగా నిలిచింది… అధికారులకు ప్రోటోకాల్ సమస్యలు తప్పండం లేదు…