AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడు మామూలోడు కాదు..! ఒకరిద్దరూ కాదు…ఏకంగా ఐదుగురికి మూడుముళ్లు వేశాడు..!

ప్రస్తుత కాలంలో ఒక పెళ్లి చేసుకోవడమే చాలా కష్టతరంగా మారింది.. అలాంటిది ఒకరికి తెలియకుండా మరొకరితో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడో నిత్య పెళ్లికొడుకు. పేద కుటుంబాన్ని ఎంచుకుంటాడు. అమ్మాయిలను

వీడు మామూలోడు కాదు..! ఒకరిద్దరూ కాదు...ఏకంగా ఐదుగురికి మూడుముళ్లు వేశాడు..!
Pre Wedding Diet
Jyothi Gadda
|

Updated on: May 24, 2022 | 9:36 PM

Share

ప్రస్తుత కాలంలో ఒక పెళ్లి చేసుకోవడమే చాలా కష్టతరంగా మారింది.. అలాంటిది ఒకరికి తెలియకుండా మరొకరితో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడో నిత్య పెళ్లికొడుకు. పేద కుటుంబాన్ని ఎంచుకుంటాడు. అమ్మాయిలను బాగా చూసుకుంటానంటూ నమ్మిస్తాడు. పెళ్లి చేసుకుని మోజు తీరాక.. పుట్టింట్లో దింపేసి వెళ్లిపోతాడు. ఇదంతా బయటపడిన వాళ్ల లిస్టేనని.. బయటకు రాకుండా ఇంకెంత మంది ఉన్నారో అంటూ బాధిత మహిళలు వాపోయారు. ఈ నిత్య పెళ్లికొడుకు లీలలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో బాధితులు పోలీస్ స్టేషన్ బాట పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మంథనిలో ఒకరికి తెలియకుండా ఒకరినీ ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్న మహా ఘనుడి బాగోతం వెలుగులోకి వచ్చింది..

ఒకరికి తెలియకుండా మరొకరిని, అలా ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, ఏకంగా ఐదుగురిని పెళ్లి చేసుకున్నాడో కేటుగాడు. మాట్రిమోనీ ద్వారా యువతులను మోసం చేస్తూ పెళ్లిళ్లు చేసుకుంటున్న నిత్య పెళ్లికొడుకుపై పోలీసులను ఆశ్రయించింది ఓ బాధితురాలు. వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం మంగళ్లపల్లికి చెందిన సగనమోని మద్దిలేటి అలియాస్‌ మధుతో… గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువతి లీలావిజయదుర్గతో మాట్రిమోని ద్వారా పెళ్లి జరిగింది. అయితే, ఆమె గర్భవతిగా ఉండగా పుట్టింట్లో దింపి వెళ్లిపోయాడు. వెళ్లినోడు మళ్లీ తిరిగి రాకపోవడంతో భర్త కోసం గాలింపు మొదలుపెట్టింది ఆ ఇల్లాలు..చివరకు పెద్దపల్లి జిల్లా మంథనిలో మధును గుర్తించింది విజయదుర్గ. ఆరు నెలలక్రితం మరో యువతిని పెళ్లి చేసుకుని, మంథనిలో కాపురం పెట్టినట్టు తెలుసుకుంది. ఇప్పుడున్న ఆమె, ఐదో భార్యని, తాను నాలుగో భార్య అని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిత్యపెళ్లికొడుకు వ్యవహారం తేల్చే పనిలో పడ్డారు.