Chief Minister’s Breakfast: స్కూళ్లలో అల్పాహారం.. అమలు తేదీ, పిల్లలకు వడ్డించే ఆహారం వివరాలివే..

Chief Minister’s Breakfast: స్కూల్ పిల్లల ఆరోగ్యం, అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ‘చీఫ్ మినిస్టర్ బ్రేక్ ఫాస్ట్’(ముఖ్యమంత్రి అల్పాహారం) పేరుతో సరికొత్త స్కీమ్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ స్కీమ్‌ను దసరా పండుగ కానుకగా.. అక్టోబర్ 24వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ పథకంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. ఈ పథకంలో భాగంగా ఉదయం.. పోషక విలువలనున్న రవ్వ కిచిడీ, సాంబార్, రవ్వ పొంగల్, గోధుమ రవ్వ కిచిడి, చట్నీ సహా వివిధ

Chief Minister’s Breakfast: స్కూళ్లలో అల్పాహారం.. అమలు తేదీ, పిల్లలకు వడ్డించే ఆహారం వివరాలివే..
CM's Breakfast Scheme
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 26, 2023 | 11:01 AM

Chief Minister’s Breakfast: స్కూల్ పిల్లల ఆరోగ్యం, అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ‘చీఫ్ మినిస్టర్ బ్రేక్ ఫాస్ట్’(ముఖ్యమంత్రి అల్పాహారం) పేరుతో సరికొత్త స్కీమ్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ స్కీమ్‌ను దసరా పండుగ కానుకగా.. అక్టోబర్ 24వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ పథకంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. ఈ పథకంలో భాగంగా ఉదయం.. పోషక విలువలనున్న రవ్వ కిచిడీ, సాంబార్, రవ్వ పొంగల్, గోధుమ రవ్వ కిచిడి, చట్నీ సహా వివిధ వంటకాలు రోజువారీ మెనూలో చేర్చనున్నట్లు పాఠశాలక విద్యాశాఖ ప్రతిపాదించింది.

ఆయా పాఠశాలల్లోనే ఈ టిఫిన్స్ తయారు చేస్తారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉదయం ప్రార్థనకు ముందు అంటే 9.30, గంటలకు విద్యార్థులకు వేడి వేడిగా టిఫిన్ వడ్డిస్తారు. అక్టోబర్ 24వ తేదీన దసరా కానుకాగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ అల్పాహారం పథకం 28,807 పాఠశాలల్లోని 23,05,801 మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. ఈ పథకం ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, మోడల్ స్కూల్స్, విద్యాశాఖ పరిధిలోని మదర్సాల్లో అమలు చేయడం జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

వివిధ పనులకు వెళ్లే తల్లిదండ్రులకు భారాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో పాటు పాఠశాలకు వెళ్లే పిల్లలకు పోషకాహారాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు విద్యార్థులందరికీ ఉచితంగా అల్పాహారం ప్రకటించింది. తద్వారా విద్యార్థుల డ్రాపౌట్స్ కూడా తగ్గించొచ్చని భావించింది. విద్యార్థుల ఆరోగ్యం, విద్యను ఈ పథకం ద్వారా మెరుగు పరచవచ్చునని ప్రభుత్వం భావించి, ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అంతకుముందు.. ప్రభుత్వం విద్యార్థులకు రాగి జావను అందించే కార్యక్రమం చేపట్టింది. బెల్లం కలిపిన మిల్లెట్ ఆధారిత సప్లిమెంట్ ఇవ్వడం వలన విద్యార్థుల్లో రక్తహీనత సమస్యను నివారించొచ్చని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇకపోతే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఉచితంగా అందిస్తోంది. ఫైన్ రైస్, పప్పు, సాంబార్, వెజిటబుల్ కర్రీ, వెజిటబుల్ బిర్యానీ, బగారా రైస్, పులిహోర వంటి ప్రత్యేక భోజనం విద్యార్థులకు వడ్డిస్తున్నారు. ఇక భోజనంలో ప్రోటీన్స్ అధికంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మధ్యాహ్నం భోజనంలో గుడ్లను కూడా వడ్డిస్తోంది. వారానికి మూడుసార్లు మధ్యాహ్న భోజనంలో గుడ్లను అందజేస్తున్నారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 నిష్పత్తిలో చెల్లించడం జరుగుతుంది. అయితే, 9, 10వ తరగతుల విద్యార్థులకు భోజనం ఖర్చుతో పాటు.. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు గుడ్డు వడ్డించడానికి అయ్యే ఖర్చునంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..