CM Revanth Reddy: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథక పరిమితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథక పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే సీపెక్ సర్వే ఆధారంగా గుర్తించిన అన్ని కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా వర్తింపజేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. తాజా బడ్జెట్‌లో కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని, ఒక విప్లవాత్మక సామాజిక భద్రతకు ముందడుగు అని సీఎం స్పష్టం చేశారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథక పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే సీపెక్ సర్వే ఆధారంగా గుర్తించిన అన్ని కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా వర్తింపజేస్తున్నట్లు గురువారం (మార్చి 26) ప్రకటించారు. తాజా బడ్జెట్‌లో కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని, ఒక విప్లవాత్మక సామాజిక భద్రతకు ముందడుగు అని సీఎం స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు కొత్తవి కాదని, గత ప్రభుత్వం నుంచి వచ్చాయని సీఎం తెలిపారు. ప్రతి నెల సగటున 89 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.240.11 కోట్లు ప్రైవేటు ఆస్పత్రులకు రూ.360.16 కోట్ల బకాయిలు ఉన్నాయని వివరించారు. ఇప్పటివరకు రూ.2408.51 కోట్లు తమ ప్రభుత్వం చెల్లించిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.927 కోట్లు చెల్లించామని, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.1,480 కోట్లు చెల్లించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
గతంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల విషయంలో అవినీతికి పాల్పడ్డారని ముఖ్యమంత్రి ఆరోపించారు. వాటన్నింటి సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు సీఎం తెలిపారు. ఇక ప్రజా ప్రభుత్వం వచ్చాక రూ.2046 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేశామన్నారు. 27 నెలల్లో పేదల వైద్యం కోసం రూ.4,500 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం తెలిపారు. అదేవిధంగా టీచింగ్ కాలేజీలకు రోగులు వెళ్లడం లేదని , వాటి పర్యవేక్షణ బాధ్యతలను గ్రూప్ 1 అధికారులకు అప్పగించనున్నట్లు సీఎం వెల్లడించారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి సంపూర్ణ వైద్యం అందించాలన్న సంకల్పంతో రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచామని సీఎం తెలిపారు. విదేశాల్లో నిపుణులైన వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలని అన్నారు. అలాగే, టీచింగ్ కాలేజీల నిర్వహణ ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేందుకు కొత్త పథకం తీసుకువచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
