AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: గుట్టు చప్పుడు కాకుండా హీరోయిన్ ను పెళ్లి చేసుకున్న క్రికెటర్.. జోడీ అదిరింది

Watch: టీమిండియా క్రికెటర్ రమణ్‌దీప్ సింగ్, ప్రముఖ టీవీ నటి చార్లీ చౌహాన్‌ను ప్రైవేట్ వేడుకలో పెళ్లి చేసుకున్నారు. కొత్త జంట పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అర్ష్‌దీప్ సింగ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. చార్లీ చౌహాన్ కెరీర్, రమణ్‌దీప్ సింగ్ క్రికెట్ గణాంకాలు, వివాహ విశేషాలు తెలుసుకుందాం.

Watch: గుట్టు చప్పుడు కాకుండా హీరోయిన్ ను పెళ్లి చేసుకున్న క్రికెటర్.. జోడీ అదిరింది
Ramandeep Singh
Rakesh
|

Updated on: Aug 08, 2026 | 8:39 AM

Share

Watch: టీమిండియా యంగ్ క్రికెటర్ రమణ్ దీప్ సింగ్ ఒక ఇంటివారయ్యారు. ప్రముఖ హిందీ బుల్లితెర నటి చార్లీ చౌహాన్‌ను ఆయన వివాహమాడారు. పంజాబ్ రంజీ జట్టుతో పాటు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున ఆడుతున్న రమణ్ దీప్ సింగ్, నటి చార్లీల వివాహం అత్యంత ప్రైవేట్ ప్రదేశంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వేడుకగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోకి రావడంతో అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రాజసం ఉట్టిపడేలా వరుడు-వధువు లుక్స్

వివాహ మహోత్సవంలో కొత్త జంట ఎంతో చూడముచ్చటగా కనిపించింది. చార్లీ చౌహాన్ సాంప్రదాయ ఎరుపు రంగు లెహంగాలో దేవకన్యలా మెరిసిపోగా, రమణ్ దీప్ సింగ్ సింగ్ గోల్డెన్ రంగు షేర్వానీలో రాజసంగా కనిపించారు. టీమిండియా స్టార్ వేగవంతమైన బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బ్లాక్ సూట్, రెడ్ టర్బన్ ధరించి ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అర్ష్‌దీప్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ జంట ఫొటోను షేర్ చేస్తూ, వారి కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలియజేశారు. గత కొన్ని రోజులుగా చార్లీ ప్రీ-వేడ్డింగ్ వేడుకల వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎవరీ చార్లీ చౌహాన్?

చార్లీ చౌహాన్ హిందీ బుల్లితెర ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటి. కైసీ యే యారియాన్ సీరియల్‌లో ముక్తి వర్ధన్ పాత్ర ద్వారా, అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్‎లో ఇలా పాత్ర ద్వారా ఆమె విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంటీవీ ప్రాచుర్యం పొందిన రోడీస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆమె నాచ్ బలియే డ్యాన్స్ షోలో కూడా పాల్గొన్నారు. అప్పట్లో ఆమె ప్రముఖ నటుడు కుంవర్ అమర్‌తో సుదీర్ఘకాలం డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. నటిగానే కాకుండా చార్లీ మంచి రైటర్, లిరిసిస్ట్‌గా కూడా రాణిస్తున్నారు. కాగా, రమణ్ దీప్ సింగ్ (28) , చార్లీ చౌహాన్ (35) ల మధ్య దాదాపు 7 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది.

రమణ్ దీప్ సింగ్ క్రికెట్ కెరీర్ వివరాలు

రమణ్ దీప్ సింగ్ సింగ్ అంతర్జాతీయ స్థాయిలో నవంబర్ 2024లో సౌతాఫ్రికాపై టీ20 మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు భారత్ తరఫున 2 మ్యాచ్‌లు ఆడి 15 పరుగులు, 1 వికెట్ తీశారు. అయితే ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఆయన కీలకమైన ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్‌లో 39 మ్యాచ్‌లు ఆడిన రమణ్ దీప్ సింగ్ 299 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌..
ఏపీలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌..
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్