Telangana: పంచాయతీ కార్యదర్శులకు పండగలాంటి వార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్.
తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పండగలాంటి వార్త చెప్పారు. కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని సోమవారం ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగానే విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం కేసీఆర్ ఆదేశించారు..

తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పండగలాంటి వార్త చెప్పారు. కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని సోమవారం ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగానే విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందు కోసం జిల్లా కలెక్టర్‌తో పాటు అడిషనల్ కలెక్టర్, జిల్లా ఫారెస్ట్ అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీ సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఉద్యోగులను పనితీరును మదింపు చేయడం ఈ కమిటీ బాధ్యత. రాష్ట్రస్థాయి నుంచి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు.
ఇదిలా ఉంటే తెలంగాణలోని కొన్ని గ్రామ పంచాయతీల్లో టెంపరరీగా కొందరు జూనియర్ పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇక తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలంటూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 16 రోజుల పాటు సమ్మె చేసిన విషయం తెలిసిందే. మొదట్లో స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు సమ్మె విరమించమన్న ఉద్యోగులు.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో చర్చలు జరిపిన తర్వాత సమ్మె విరమించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
